Kedarnath | సెల్ఫీ మోజు.. మందాకిని నదిలో పడ్డ యాత్రికుడు
Kedarnath | విధాత: సెల్ఫీ మోజు ఓ యాత్రికుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాలు దక్కాయి. లేకుంటే ప్రాణాలు మందాకిని నదిలో కొట్టుకుపోయేవి. అసలు ఏమి జరిగిందంటే.. #Watch: Pilgrim falls in Mandakani River while trying to take a selfie. He was rescued by the swift action of the SDRF team The man was en route to the Kedarnath […]

Kedarnath | విధాత: సెల్ఫీ మోజు ఓ యాత్రికుడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాలు దక్కాయి. లేకుంటే ప్రాణాలు మందాకిని నదిలో కొట్టుకుపోయేవి. అసలు ఏమి జరిగిందంటే..
#Watch: Pilgrim falls in Mandakani River while trying to take a selfie. He was rescued by the swift action of the SDRF team
The man was en route to the Kedarnath Shrine #kedarnath #accident #uttarakhand #india #news #breakingnews pic.twitter.com/8vvjwITSAl
— News18 (@CNNnews18) September 5, 2023
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ యాత్రికుడు సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. మంగళవారం మందాకిని నది ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక్కసారిగా జారి నదిలో జారిపడ్డాడు. నది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒక రాయి దగ్గర చిక్కుకున్నాడు.
సమాచారం అందుకున్న సమీపంలోనే ఉన్న ఎస్డీఆర్ ఎఫ్ బృందం ఘటనాస్థలికి వచ్చి తాళ్ల సాయంతో బాధితుడిని బయటకు తీసుకొచ్చింది. బతుకు జీవుడా అంటూ యాత్రికుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్‌గా మారింది.