Kedarnath | కేదార్నాథ్ శివలింగంపై.. నోట్లు వెదజల్లిన మహిళ.. వీడియో వైరల్
Kedarnath విధాత: పదకొండవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ గర్భగుడిలో అపచారం జరిగింది. ఓ మహిళ శివలింగంపై నోట్లను వెదజల్లడం వివాదాస్పదంగా మారింది. సదరు మహిళ శివ లింగంపై నోట్లు జల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ కమిటీ ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అయితే మహిళ లింగంపై నోట్లు వెదజల్లే వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ గర్భగుడిలో డబ్బులు నోట్లు వెదజల్లుతున్నప్పుడు అక్కడున్న పూజార్లు […]

Kedarnath
విధాత: పదకొండవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ గర్భగుడిలో అపచారం జరిగింది. ఓ మహిళ శివలింగంపై నోట్లను వెదజల్లడం వివాదాస్పదంగా మారింది. సదరు మహిళ శివ లింగంపై నోట్లు జల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ కమిటీ ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
అయితే మహిళ లింగంపై నోట్లు వెదజల్లే వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ గర్భగుడిలో డబ్బులు నోట్లు వెదజల్లుతున్నప్పుడు అక్కడున్న పూజార్లు కూడా మంత్రాలు చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఘటన జరిగినప్పుడు కేదార్ ఆలయ కమిటీ ఉద్యోగులు కూడా ఆలయం లోపల ఉన్నారని తెలుస్తోంది.నిజానికి కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం.. కానీ ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా.. నోట్లు జల్లుతున్నప్పుడు వీడియో కూడా తీయించుకుంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేవాలయంలో ఇదేం పని అని చాలా మంది ప్రశ్నించారు. మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేదార్ నాథ్ ఆలయ కమిటీ (BKTC) అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు వివరణ ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ విషయమై రుద్రప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో మాట్లాడి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో డీఎం మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ మహిళ చేసిన ఈ చర్య సిగ్గుచేటని అన్నారు. బాబా కేదార్నాథ్ కోర్టులో ఇలాంటి చర్య క్షమించరానిదన్నారు.
కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అయిన బాబా కేదార్నాథ్ గర్భగుడిలో ఓ మహిళ డబ్బులు వెదజల్లడం తప్పుడు పనిగా పరిగణించారు. ఘటన జరిగినప్పుడు కేదార్ నాథ్ ఆలయంలో ఉన్న కమిటీ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకున్నారు. అయితే నోట్లు వెదజల్లిన మహిళ ఎవరో తెలియరాలేదు.