Lokeshwara Swamy: కీచక స్వామిజీ..లోకేశ్వరస్వామి అరెస్టు !
Lokeshwara Swamy: కీచక స్వామిజీ..కర్నాటక రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల యువతిపై లోకేశ్వరస్వామిజీ అత్యాచారం చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మే 13వ తేదీన బాలిక ఇంటికి వెళ్తుంటే కారులో తీసుకెళ్లాడు. సైలెంట్‌గా ఉండకుండా గొడవ చేస్తే చంపేస్తామనని బెదిరించి.. బాగల్‌కోట్, రాయచూర్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాయచూర్‌లోని ఓ లాడ్జిలో నిర్భంధించి 2 రోజుల పాటు అత్యాచారం చేశాడని..అనంతరం బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

అత్యాచారం అనంతరం మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను స్వామీజి వదిలేసి..అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో లోకేశ్వరస్వామిపై అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలతో ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram