Falaknuma Express | ఫలక్‌నుమా ప్రమాదంపై కీలక ఆధారాలు
Falaknuma Express విధాత, అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కారణాల నిర్ధారణకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన పూర్తిగా దగ్ధమైన నాలుగు బోగీలను ఢిల్లీ నుండి వచ్చిన 12మంది క్లూస్ టీమ్ సభ్యుల బృందం పరిశీలించింది. ఫోరెన్సి్‌క్ , రైల్వే సహా సాంకేతి నిపుణులతో కూడిన క్లూస్ టీమ్ సభ్యులు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించి మంటలు చెలరేగడానికి కారణాలను ఆన్వేషించారు. మంటలు ఎస్ 4 బోగీ […]

Falaknuma Express
విధాత, అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కారణాల నిర్ధారణకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన పూర్తిగా దగ్ధమైన నాలుగు బోగీలను ఢిల్లీ నుండి వచ్చిన 12మంది క్లూస్ టీమ్ సభ్యుల బృందం పరిశీలించింది.
ఫోరెన్సి్‌క్ , రైల్వే సహా సాంకేతి నిపుణులతో కూడిన క్లూస్ టీమ్ సభ్యులు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించి మంటలు చెలరేగడానికి కారణాలను ఆన్వేషించారు.
మంటలు ఎస్ 4 బోగీ వాష్ రూమ్ నుండి వెలువడ్డాయని క్లూస్ టీమ్ ప్రాథమికంగా నిర్ధారించుకుంది. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు చెలరేగాయని అభిప్రాయపడింది.
అయితే సిగరేట్ కాల్చడం ద్వారా లేక షార్ట్ సర్కూట్‌తోనా, విద్రోహ చర్యనా అన్న కోణాల్లోనూ క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తుందని రైల్వే పోలీసులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు కూడా బోగీలను పరిశీలించారు.