బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఈ అమ్మడు తెలుగులో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది. అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేయగా, ఈ చిత్రం బెడిసి కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కియారా మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత చెర్రీతో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా తన అందచందాలతో ఆకట్టుకుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే కియారా అద్వాని.. కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రను పెళ్లి చేసుకుంది. అతనితో కలిసి ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది.
వీరిద్దరు కలిసి సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కియారా విధ్వంసం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ భామ కుర్రకారుకి చెమటలు పట్టిస్తుంది.
ఫెమినా మ్యాగజైన్ ముఖచిత్రం కోసం, కియారా కొత్త హెయిర్ కట్లో చాలా అందంగా కనిపించింది. తన జుట్టును బ్యాంగ్స్‌లో స్టైల్ చేసి, తన ముఖాన్ని పర్ఫెక్ట్గా రూపొందించుకుని కెమెరాకు పోజులిచ్చింది. ఆమె పచ్చని దుస్తులలో ఆకర్షణీయంగా కనిపించడం , ఆమె జుట్టును భుజం మీద వదులుగా వదిలేయడంతో కియారా క్యూట్‌గా కనిపిస్తుంది.
చాలా హాట్ హాట్‌గా కనిపిస్తున్న కియారాని చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. అందంతో అరాచకం సృష్టించడంతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని రూటే సపరేటు.. అబ్బబ్బ ఏం అందం అనేలాగా.. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తూ కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది.
పెళ్ళితరువాత కాని.. పెళ్ళికి ముందు కాని కియారా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేసింది లేదు. కాని తాజాగా మాత్రం అజంతా శిల్ఫంలా అద్భుతం చేసింది బ్యూటీ. అయితే ఈరేంజ్ లో హాట్ షో చేయడంతో.. నీకు పెళ్ళైంది.. కాస్త గుర్తు పెట్టుకో అని కొందరు నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కియారా బ్యూటీ ఫుల్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.