భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించి.. ప్రియుడితో కలిసి ఘాతుకం
విధాత, యాదాద్రి భువనగిరి: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అంతం చేసింది. విషయం బయట పడకుండా మోటార్ బైక్ ప్రమాదంగా చిత్రీకరించింది. ఆడపడుచుకు వచ్చిన అనుమానంతో అసలు విషయం బయట పడి కటకటాల పాలైంది. మంగళవారం భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంత పూర్ గ్రామ పరిధి లోని కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి సికిందరాబాద్ లో […]

విధాత, యాదాద్రి భువనగిరి: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అంతం చేసింది. విషయం బయట పడకుండా మోటార్ బైక్ ప్రమాదంగా చిత్రీకరించింది. ఆడపడుచుకు వచ్చిన అనుమానంతో అసలు విషయం బయట పడి కటకటాల పాలైంది.
మంగళవారం భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంత పూర్ గ్రామ పరిధి లోని కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి సికిందరాబాద్ లో ఉంటున్నారు.

ఒక పెళ్లిలో జనగాం జిల్లా అడవి కేశవపూర్‌కు చెందిన దారావత్ ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి సొంతూరుకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు.
అయితే భర్త ఊరెళ్ళాడని చెప్పడంతో ప్రవీణ్ భారతి ఇంటికి వచ్చాడు. అంతలోనే భర్త కొంరెల్లి ఊరెళ్ళకుండా ఇంటికి తిరిగి రాగా భార్య ప్రవీణ్ తో ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని భారతి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి కొంరెల్లి పై దాడి చేసి గొంతుకు చున్నీ బిగించి ప్రాణం తీశారు.

ఈ విషయం బయట పడకుండా కొంరెల్లి మృత దేహాన్ని మోటార్ బైక్ పై తీసుకువచ్చి హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి మండలం అనంతారం వద్ద బ్రిడ్జి పై నుంచి కిందకు తోసి ప్రమాదంగా చిత్రీకరించారు. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా భార్య భారతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పి హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో నిందితులు భారతి, ప్రవీణ్ లను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు