బైక్‌ మీటర్ బాక్స్‌లోకి దూరిన నాగుపాము.. ఒక్కసారి పడగ విప్పడంతో భయపడ్డ బైకర్.. వీడియో

King Cobra | నాగుపాము పేరు వినగానే శరీరమంతా గగుర్పాటుకు గురవుతోంది. చెమటలు పట్టేస్తాయి. ఇక ఆ పాము నుంచి తప్పించుకునేందుకు పరుగులు కూడా పెడుతాం. అలాంటి నాగుపాము ఏకంగా బైక్ లోకి దూరింది. ఒక్కసారి ఆ పాము పడగ విప్పడంతో బైకర్ భయపడిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. నర్సింగ్ పూర్‌కు చెందిన నజీర్ ఖాన్ రాత్రి సమయంలో తన ఇంటి ముందు బైక్ ఆపి నిద్రించాడు. పొద్దున్నే లేచి బైక్‌ను తీసుకొని […]

బైక్‌ మీటర్ బాక్స్‌లోకి దూరిన నాగుపాము.. ఒక్కసారి పడగ విప్పడంతో భయపడ్డ బైకర్.. వీడియో

King Cobra | నాగుపాము పేరు వినగానే శరీరమంతా గగుర్పాటుకు గురవుతోంది. చెమటలు పట్టేస్తాయి. ఇక ఆ పాము నుంచి తప్పించుకునేందుకు పరుగులు కూడా పెడుతాం. అలాంటి నాగుపాము ఏకంగా బైక్ లోకి దూరింది. ఒక్కసారి ఆ పాము పడగ విప్పడంతో బైకర్ భయపడిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

నర్సింగ్ పూర్‌కు చెందిన నజీర్ ఖాన్ రాత్రి సమయంలో తన ఇంటి ముందు బైక్ ఆపి నిద్రించాడు. పొద్దున్నే లేచి బైక్‌ను తీసుకొని వేరే ఊరికి బయల్దేరాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత నాగుపాము బుసలు కొడుతూ.. స్పీడో మీటర్‌లో అటు ఇటు కదులుతూ కనిపించింది.. కొద్దిసేపటి తర్వాత ఆ మీటర్‌లోనే పడగ విప్పింది.

దీంతో ఒక్కసారిగా భయపడ్డ నజీర్ వెంటనే బైక్‌ను పక్కన ఆపేశాడు. ఇది గడనించిన స్థానికులు ఆ బైక్ వద్ద గుమిగూడారు. చివరకు నజీర్ స్పీడో మీటర్‌ను పగులగొట్టగా ఆ పాము అక్కడ్నుంచి మెల్లగా బయటకు వచ్చి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.