Klin kaara | క్లింకార ఫోటోలు ఔట్.. మెగా ప్రిన్సెన్స్‌ని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

Klin kaara | జూన్ 20 మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులకి చాలా స్పెష‌ల్ అన్న సంగ‌తి తెలిసిందే. ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఈ ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు కావ‌డంతో చాలా మురిసిపోయారు. క్లీంకార రాకకు సంబంధించి హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియో ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌గా, అందులో ఫ్యామిలీ అంతా హ్యాపీ మూమెంట్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో క‌నిపించింది. క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో […]

  • Publish Date - August 16, 2023 / 03:51 PM IST

Klin kaara |

జూన్ 20 మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులకి చాలా స్పెష‌ల్ అన్న సంగ‌తి తెలిసిందే. ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఈ ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు కావ‌డంతో చాలా మురిసిపోయారు. క్లీంకార రాకకు సంబంధించి హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన వీడియో ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌గా, అందులో ఫ్యామిలీ అంతా హ్యాపీ మూమెంట్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో క‌నిపించింది.

క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో చాలా హృద్యంగా చూపించారు. ద్రావిడ సంస్కృతిలో త‌న పాప భాగం కావాల‌ని కోరుకున్న‌ట్టు ఉపాస‌న చెప్పుకొచ్చింది. ద‌య‌చేసి ఎవ‌రు కూడా క్లింకార‌ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వొద్దని కోరింది. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని తాము భావిస్తున్న‌ట్టు పేర్కొంది.

పిల్ల‌ల పెంప‌కంలో ఇవెంతో ముఖ్య‌మైన‌వని చెప్పిన ఉపాస‌న జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాల‌ని తెలియ‌జేసింది.అయితే క్లింకార పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ చిన్నారికి సంబంధించిన ఒక్క ఫొటో అయిన బ‌య‌ట‌కు వ‌స్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఉపాస‌న త‌న కూతురికి సంబంధించిన క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఆగ‌స్ట్ 15న ప్ర‌తి ఒక్క‌రు స్వాతంత్య్ర దినోత్స‌వం వేడుక‌లు జ‌రుపుకోగా, ఆ వేడుక‌ల‌లో క్లింకార కూడా పాల్గొంది. త‌న అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌ల‌తో క‌లిసి తొలిసారి ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలు ఉపాస‌న షేర్ చేయ‌గా, ఆ పిక్స్ లో క్లింకార ఫేస్ కొంత మాత్ర‌మే క‌నిపిస్తుంది. సైడ్ యాంగిల్‌లో కాస్త కనిపిస్తుండ‌గా, అంద‌రు కూడా రామ్ చ‌ర‌ణ్ పోలిక‌ల‌తో ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అయితే క్లింకార పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, బ్రో మూవీ ప్రమోష‌న్స్ లో మెగా ప్రిన్సెస్‌ గురించి సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్.. క్లింకార‌కి ఎవరి పోలికలు వచ్చాయో చెప్పాడు. ‘క్లింకార అచ్చం రామ్‌చరణ్‌ లాగే ఉంద‌ని, క‌ళ్లు చాలా బాగున్నాయ‌ని అన్నాడు. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు క‌దా, క్లింకార విషయంలోనూ అదే జరిగింది అని అన్నాడు సాయి ధ‌ర‌మ్.

Latest News