Kodi Kathi Case | కోడి కత్తి కేసు ఎన్‌ఐఏకు బదిలీ
Kodi Kathi Case విధాత, వైఎస్. జగన్ పై కోడి కత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీను కేసును విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసును ఆగస్టు 8వ తేదికి వాయిదా వేసింది. కాగా కోడి కత్తి శ్రీను తరపు న్యాయవాది గగన సింధు దీనిపై స్పందిస్తు కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు. నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలేసేదే […]

Kodi Kathi Case
విధాత, వైఎస్. జగన్ పై కోడి కత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీను కేసును విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కేసును ఆగస్టు 8వ తేదికి వాయిదా వేసింది. కాగా కోడి కత్తి శ్రీను తరపు న్యాయవాది గగన సింధు దీనిపై స్పందిస్తు కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు.
నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలేసేదే లేదని, ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు. కేసు కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలన్నారు.