Kokapet Lands | కోకాపేట్ సెంచరీతో జోష్..వేల కోట్ల టార్గెట్
Kokapet Lands బుద్వేల్ భూములకు 10న వేలం ఎకరా కనీస ధర 20కోట్లు మోకిలాలో 7న 1,321ఫ్లాట్లకు వేలం 28న రాజేంద్రనగర్‌లో 60ఎకరాలకు వేలం భూముల అమ్మకంపై విపక్షాల అభ్యంతరం హైద్రాబాద్ పరపతికి నిదర్శనమన్న సర్కార్ విధాత: హైద్రాబాద్‌లో కోకాపేట్ భూముల వేలంలో ఏకంగా ఎకరా 100.75కోట్లు పలకడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రాగా అదే జోష్‌లో బుద్వెల్, మోకిలాలో భూముల వేలంకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కోకాపేట భూముల ఎకరా వేలం ధర దేశంలోనే రికార్డుగా […]

Kokapet Lands
- బుద్వేల్ భూములకు 10న వేలం
- ఎకరా కనీస ధర 20కోట్లు
- మోకిలాలో 7న 1,321ఫ్లాట్లకు వేలం
- 28న రాజేంద్రనగర్‌లో 60ఎకరాలకు వేలం
- భూముల అమ్మకంపై విపక్షాల అభ్యంతరం
- హైద్రాబాద్ పరపతికి నిదర్శనమన్న సర్కార్
విధాత: హైద్రాబాద్‌లో కోకాపేట్ భూముల వేలంలో ఏకంగా ఎకరా 100.75కోట్లు పలకడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రాగా అదే జోష్‌లో బుద్వెల్, మోకిలాలో భూముల వేలంకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కోకాపేట భూముల ఎకరా వేలం ధర దేశంలోనే రికార్డుగా నిలిచింది. కోకాపేటలో 7.34ఎకరాల విస్తీర్ణంలోని 7 ఫ్లాట్లను 1586.55కోట్ల అంచనాతో వేలం పెట్టగా, 3319.60కోట్లు వేలం ద్వారా ప్రభుత్వానికి లభించాయి. దీంతో బుద్వెల్, మోకిలా భూములకు కూడా కనీస వేలం మొత్తానికి మించి ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
ప్రతిపక్షాలు భూముల అమ్మకాన్ని తప్పుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం ఇది హైద్రాబాద్ పరపతికి నిదర్శనమంటు ప్రకటించుకుని మరిన్ని భూముల వేలం దిశగా ముందుకెలుతుంది. అందులో భాగంగా బుద్వేల్‌లో 100ఎకరాల భూముల అమ్మకానికి ఈనెల 10న హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈనెల 6వ తేదిన ఫ్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించనున్నారు.
వేలంలో పాల్గొనేవారు ఈనెల 8వ తేది సాయంత్రం 5గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 10వ తేదిన రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో భూములకు వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ భూములు 100ఎకరాలను 3.47ఎకరాల నుంచి 14.33ఎకరాల విస్తీర్ణంతో మొత్తం 14 ఫ్లాట్లుగా విభజించి వేలం నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 7వ తేదిన మోకిలాలో 6.25ఎకరాలలో, 1,321ఫ్లాట్లను కూడా వేలం వేయనున్నారు. 28వ తేదిన రాజేంద్రనగర్ లేక్ సిటీ పేరుతో 60ఎకరాల ఫ్లాట్లకు హెచ్‌ఎండీఏ వేలం పాట నిర్వహించనున్నారు.