Global investors summit 2023 | ‘హైదరాబాద్ అన్నయ్య.. విశాఖ తమ్ముడు’ పెట్టుబడుల సదస్సుకు కేటీఆర్ గ్రీటింగ్స్
Global investors summit | విధాత: భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్చి మూడు, నాలుగో తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023(Global investors summit 2023)కు విస్తృత ఏర్పాట్లు చేశారు. అంబానీ (Ambani), అదానీ (Adani), బిర్లా(Birla), జిందాల్ (Jindal) తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్న సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ (Chief Minister Jagan) ఇప్పటికే విశాఖ చేరుకోగా ఈ […]

Global investors summit | విధాత: భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్చి మూడు, నాలుగో తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023(Global investors summit 2023)కు విస్తృత ఏర్పాట్లు చేశారు. అంబానీ (Ambani), అదానీ (Adani), బిర్లా(Birla), జిందాల్ (Jindal) తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్న సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ (Chief Minister Jagan) ఇప్పటికే విశాఖ చేరుకోగా ఈ రెండ్రోజులూ విశాఖ ప్రత్యేక విమానాలతో హోరెత్తనుంది. ఈ మేరకు ఈ సదస్సుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) కూడా వినూత్నంగా అభినందనలు తెలిపారు. విశాఖను తన తమ్ముడిగా భవిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!I wish them the very best