Bandi Sanjay | పథకం ప్రకారమే పేపర్ల లీకేజీ.. సూత్రదారి బండి సంజయ్! ఫోన్‌లో కీలక సమాచారం: పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్

బండి సంజయ్‌కి 14 రోజులపాటు రిమాండ్ విధించిన హన్మకొండ మేజిస్ట్రేట్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పేపర్ లికేజీకి సూత్రధారి బండి సంజయ్‌, ఏ1గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిందితునిగా ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. ఈ పేపర్ లీకేజీ కేసులో ఏవన్ గా బండి సంజయ్ A2గా బొరం ప్రశాంత్, A3గా మహేష్, A4గా శివ […]

  • By: krs    latest    Apr 05, 2023 5:45 PM IST
Bandi Sanjay | పథకం ప్రకారమే పేపర్ల లీకేజీ.. సూత్రదారి బండి సంజయ్! ఫోన్‌లో కీలక సమాచారం: పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్

బండి సంజయ్‌కి 14 రోజులపాటు రిమాండ్ విధించిన హన్మకొండ మేజిస్ట్రేట్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పేపర్ లికేజీకి సూత్రధారి బండి సంజయ్‌, ఏ1గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిందితునిగా ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు.

ఈ పేపర్ లీకేజీ కేసులో ఏవన్ గా బండి సంజయ్ A2గా బొరం ప్రశాంత్, A3గా మహేష్, A4గా శివ గణేష్, A5 మైనర్ బాలుడు కమలాపూర్, A-6: పోగు సుబాష్, A-7: పోగు శశాంక్ @ రింకు, A-8: ధూలం శ్రీకాంత్, A-9: పెరుమాండ్ల శ్రామిక్ @ నాని, A10. పోతనబోయిన వర్శిత్ @ చందు నిందితులుగా ఉన్నారని సిపి చెప్పారు. బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేశారన్నారు.

నిందితులపై 120b, 420,447,505(1)(b) IPC sec (4) సెక్షన్లలో కేసులు నమోదు చేశామని చెప్పారు. విచారణలో కొత్త విషయాలు వస్తే సెక్షన్స్ మారుతాయని, అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటూ వివరించారు. హనుమకొండలో బుధవారం సాయంత్రం సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారని చెప్పారు.

ప్రశాంత్‌కు. బండి సంజయ్‌కి లింక్

ఎ2 గా ఉన్న బూరం ప్రశాంత్ ప్రస్తుతం జర్నలిస్ట్ కాదు, చాలా మందికి ప్రశ్నపత్రం వాట్సప్‌లో పంపించా డని సీపీ తెలిపారు. గుండెబోయిన్ మహేష్ కూడా చాలామందికి పంపించారన్నారు. ఈటెల రాజేందర్ కు కూడా ప్రశ్నాపత్రం పంపించారని, మొన్న సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ చేశాడన్నారు. ప్రశాంత్ చాటింగ్‌లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడాడని, ముందు రోజు వాట్సప్ కాల్ బండి సంజయ్‌తో ప్రశాంత్ మాట్లాడాడని వివరించారు.

Warangal: బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు

11.18 నిమిషాలక్7 హైదరాబాద్‌లో మీడియా హెడ్స్ కు ఫార్వార్డ్ చేశాడన్నారు. 11.24 నిమిషాలకు బండి సంజయ్‌కి ఫార్వార్డ్ చేశాడని, చాలామందికి మెసేజ్ చేశాడన్నారు. ఈటెల రాజేందర్, అతని PA, పలువురు బీజేపీ నేతలకు పేపర్ పంపాడని వివరించారు. ప్లాన్ చేశాడు కాబట్టే బండి సంజయ్ ని A-1 గా పెట్టామన్నారు. చాలా డేటా డిలేట్ చేశారని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే చేశారన్నారు.

సంజయ్ ఫోన్ దొరికితే ఇంకా వివరాలు లభిస్తాయి

ఎంపీ బండి సంజయ్ ఫోన్ లేదంటున్నాడని, ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుందని సిపి రంగనాథ్ చెప్పారు. కాల్ డేటా రావాలిసి ఉంది, వాట్సప్ చాటింగ్ కూడా ఇంకా రావాలని సీపీ అన్నారు. కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని చెప్పారు. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంత్ పని చేస్తున్నాడని, కమలాపూర్‌లోనే ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరా తీశామన్నారు.

గేమ్ ప్లాన్‌లో భాగంగానే లీకేజీ

ముందుగా మాట్లాడుకుని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుంచి లీక్ చేశారని సీపీ వివరించారు. ఇది యాదృచ్చికంగా జరిగింది కాదని, గేమ్ ప్లాన్ ప్రకారం పేపర్ లికేజ్ జరుగుతుందన్నారు.

41 సీ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు

41సీఆర్పీ ప్రకారం వారెంట్ లేకుండా ఎంపీని అరెస్ట్ చేయొచ్చుని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ స్పీకర్‌కు కూడా సమాచారం ఇచ్చి అరెస్ట్ వివరాలు తెలిపామన్నారు. పక్కా లీగల్ ప్రాసెస్ చేస్తున్నాం, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదన్నారు. వరంగల్‌లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని వివరించారు.