Wrestlers Protest | అమిత్ షాను కలిసిన రెజ్లర్లు
Wrestlers Protest గంటపాటు సుదీర్ఘంగా చర్చలు అభియోగాలపై నిష్పక్షపాత విచారణ బ్రిజ్‌పై తక్షణ చర్యలకు డిమాండ్ చట్టం తన పని తాను చేస్తుందన్న హోంమంత్రి అమిత్ షా విధాత: తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ కొంతకాలంగా ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న టాప్ రెజ్లర్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి 11 […]

Wrestlers Protest
- గంటపాటు సుదీర్ఘంగా చర్చలు
- అభియోగాలపై నిష్పక్షపాత విచారణ
- బ్రిజ్‌పై తక్షణ చర్యలకు డిమాండ్
- చట్టం తన పని తాను చేస్తుందన్న హోంమంత్రి అమిత్ షా
విధాత: తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ కొంతకాలంగా ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న టాప్ రెజ్లర్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఒలింపియన్ బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు.
హోంమంత్రి అమిత్‌షాతో సుమారు గంటపాటు రెజ్లర్లు బ్రిజ్ అంశంపై చర్చించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. షాను కలిసినవారిలో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగాట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు. బ్రిజ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికతోపాటు ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు బ్రిజ్‌పై అభియోగాలు ఉన్నాయి.
చట్టం దృష్టిలో అందరూ సమానమేనని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. చట్టం తన పనితాను చేసుకుపోతుందని రెజ్లర్లకు భరోసా ఇచ్చారు. ఐదు రోజుల్లోగా బ్రిజ్‌పై చర్యలు తీసుకోని పక్షంలో తమ పతకాలను గంగానదిలో పారేస్తామని రెజ్లర్లు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, శనివారంతో ఆ ఐదు రోజులు గడువు ముగిసింది. అయితే, రైతు నాయకుడు నరేశ్ టికాయత్ జోక్యంతో వారి కార్యచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు.