London Soldiers | కవాతు చేస్తూ ఎండకు కళ్లు తిరిగిపడిపోయిన సైనికులు..
London Soldiers విధాత: ఎంతో కఠినమైన పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తించే సైనికులకూ ఎండ దెబ్బ తప్పడం లేదు. తాజాగా లండన్‌లోని ప్రిన్స్ విలియమ్స్ ముందు ఓ సన్నాహక కవాతులో సైనికులు పాల్గొనగా.. కనీసం ముగ్గురు సైనికులు వడదెబ్బకి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. లండన్‌లో ప్రస్తుతం 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. ఎర్రని కోటు, నల్లని పొడవైన కుచ్చుటోపీలు పెట్టుకుని కార్యక్రమంలో పాల్గొనడంతో సైనికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లోనూ సన్నాహక కవాతును అద్భుతంగా నిర్వహించారని […]

London Soldiers
విధాత: ఎంతో కఠినమైన పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తించే సైనికులకూ ఎండ దెబ్బ తప్పడం లేదు. తాజాగా లండన్‌లోని ప్రిన్స్ విలియమ్స్ ముందు ఓ సన్నాహక కవాతులో సైనికులు పాల్గొనగా.. కనీసం ముగ్గురు సైనికులు వడదెబ్బకి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు.
లండన్‌లో ప్రస్తుతం 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. ఎర్రని కోటు, నల్లని పొడవైన కుచ్చుటోపీలు పెట్టుకుని కార్యక్రమంలో పాల్గొనడంతో సైనికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లోనూ సన్నాహక కవాతును అద్భుతంగా నిర్వహించారని పేర్కొంటూ కవాతు అనంతరం ప్రిన్స్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఉష్ణోగ్రతలు ఠారెత్తుతున్ననేపథ్యంలో యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కింగ్ ఛార్లెస్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే కలర్ పరేడ్ కోసమే ఈ సన్నాహక కవాతు నిర్వహించారు. అధికారిక కార్యక్రమం జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనుంది.