Soldiers | 42 మంది సైనికులకు తీవ్ర అస్వస్థత.. ఆ ఆర్మీ క్యాంపులో ఏం జరిగిందంటే..?
Soldiers | కర్ణాటక హసన్ జిల్లాలోని ఓ ఆర్మీ క్యాంపులో సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పొందుతున్న వారిలో 42 మందికి పైగా సైనికులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మంగళవారం రాత్రి సైనికులందరూ డిన్నర్ చేసి నిద్రకు ఉపక్రమించారు. కాసేపటికే 42 మందికి పైగా సైనికులకు విరేచనాలు, వాంతులు అయ్యాయి. అప్రమత్తమైన ఆర్మీ అధికారులు వారిని క్రాఫోర్డ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సైనికుల ఆరోగ్య […]

Soldiers | కర్ణాటక హసన్ జిల్లాలోని ఓ ఆర్మీ క్యాంపులో సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పొందుతున్న వారిలో 42 మందికి పైగా సైనికులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే మంగళవారం రాత్రి సైనికులందరూ డిన్నర్ చేసి నిద్రకు ఉపక్రమించారు. కాసేపటికే 42 మందికి పైగా సైనికులకు విరేచనాలు, వాంతులు అయ్యాయి. అప్రమత్తమైన ఆర్మీ అధికారులు వారిని క్రాఫోర్డ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సైనికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆర్మీ క్యాంపులో మొత్తం 100 మంది సైనికులు డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి అన్నం, పప్పు, పనీర్ కర్రీతో కూడిన భోజనం చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ శాంపిళ్లను సేకరించారు. ఇప్పటికే 21 మంది డిశ్చార్జి చేసినట్లు వైద్యులు చెప్పారు. మిగతా సైనికులను కూడా వీలైనంత త్వరగా డిశ్చార్జ్ చేస్తామన్నారు.