LPG Cylinder Prices | కమర్షియల్ సిలిండర్‌పై రూ.171 తగ్గిన ధర..!
LPG Cylinder Prices | కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.171.50 వరకు చమురు కంపెనీలు తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ ధరలను మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. తాజాగా తగ్గించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1856.50కి చేరింది. కోల్‌కతాలో ధర రూ.1,960.50, ఆర్థిక రాజధాని ముంబయి […]

LPG Cylinder Prices |
కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.171.50 వరకు చమురు కంపెనీలు తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ ధరలను మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి.
తాజాగా తగ్గించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1856.50కి చేరింది. కోల్‌కతాలో ధర రూ.1,960.50, ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో రూ.1808కి పడిపోయింది. చెన్నైలో ధర ప్రస్తుతం రూ.2021 తగ్గింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చ్ 1న పెంచాయి. యూనిట్‌పై రూ.350.50 పెంచాయి. గృహవినియోగ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. ఏప్రిల్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.92 వరకు తగ్గింది. ఈ ఏడాదిలో మూడుసార్లు పెరగ్గా.. రెండుసార్లు తగ్గుముఖం పట్టాయి.