Pune | పుణెలో దారుణం.. పట్టపగలే యువతిపై వేట కొడవలితో దాడి..
Crime News | Pune | ఓ యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. ఓ యువతిని వెంబడిస్తూ పట్టపగలే వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ముంబైలోని పుణె వీధుల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పుణె వీధిలోని సదాశివపేట ఏరియాలో ఓ కాలేజీ యువతి, మరో అబ్బాయి కలిసి యాక్టివాపై వెళ్తున్నారు. అక్కడే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు వారి బైక్‌ను ఆపాడు. ఇక క్షణాల్లోనే తన బ్యాగులో ఉన్న […]

Crime News | Pune |
ఓ యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. ఓ యువతిని వెంబడిస్తూ పట్టపగలే వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ముంబైలోని పుణె వీధుల్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పుణె వీధిలోని సదాశివపేట ఏరియాలో ఓ కాలేజీ యువతి, మరో అబ్బాయి కలిసి యాక్టివాపై వెళ్తున్నారు. అక్కడే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు వారి బైక్‌ను ఆపాడు. ఇక క్షణాల్లోనే తన బ్యాగులో ఉన్న వేట కొడవలిని బయటకు తీశాడు.
అతన్ని నుంచి తప్పించుకునేందుకు యువతి పరుగు పెట్టగా.. ఆమెను వెంబడిస్తూ పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆమెపై వేట కొడవలితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన స్థానికులపై కూడా కొడవలితో దాడి చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
అయితే దుండగుడిపై అక్కడున్న వారు వస్తువులు విసిరేశారు. దీంతో ఆందోళనకు గురైన దుండగుడు.. వారిపై కూడా దాడి చేసేందుకు యత్నించాడు. ఈ లోపు యువతిని కొందరు దుండగుడి నుంచి రక్షించారు. దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
దుండగుడిని లక్ష్మణ్ జాదవ్(22)గా గుర్తించారు. బాధితురాలిని ప్రీతి రామ్‌చంద్ర(19)గా గుర్తించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణ్ జాదవ్ ప్రేమ పేరుతో గత కొన్ని రోజుల నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నట్లు ఆమె తెలిపింది.