Mahender Reddy | పార్టీ మారినప్పుడే రోహిత్‌రెడ్డి ఔట్‌డేటెడ్‌ అయ్యాడు

Mahender Reddy పైలట్‌ పై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీరియస్ విధాత: పార్టీ మారినప్పుడే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఔట్‌ డేటెడ్‌ అయ్యాడని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సీరియస్‌ అయ్యాడు. తనను ఔట్ డేటెడ్ అన్న వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి మండిపడ్డారు. అనుకోకుండా గెలిచి తాను మొనగాడిననుకుంటున్నాడన్నారు. ఆయన గతంలో ఏమీ చెప్పాడో అందరికీ తెలుసన్నారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యాడన్నారు. టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో […]

Mahender Reddy  | పార్టీ మారినప్పుడే రోహిత్‌రెడ్డి ఔట్‌డేటెడ్‌ అయ్యాడు

Mahender Reddy

  • పైలట్‌ పై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీరియస్

విధాత: పార్టీ మారినప్పుడే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఔట్‌ డేటెడ్‌ అయ్యాడని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సీరియస్‌ అయ్యాడు. తనను ఔట్ డేటెడ్ అన్న వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి మండిపడ్డారు. అనుకోకుండా గెలిచి తాను మొనగాడిననుకుంటున్నాడన్నారు.

ఆయన గతంలో ఏమీ చెప్పాడో అందరికీ తెలుసన్నారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యాడన్నారు. టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో తెలుస్తోందన్నారు. రోహిత్‌రెడ్డి మాటలు అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు.

అధిష్టానం టికెట్ ఇస్తానని తనకు హామీ ఇచ్చిందన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదని పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు