మహేష్ బాబు కొడుకు పెద్దవాడయ్యాడు.. పాపం నమ్రత!

Mahesh babu , Namrata మహేష్ బాబును ప్యూర్ జెంటిల్మెన్, ఫ్యామిలీ మెన్ అని చెప్పవచ్చు. ఆయనకు సినిమాల తర్వాత ఆయన కుటుంబమే ప్రపంచం. భార్యతో పాటు పిల్లలయిన గౌతమ్, సితారలతో ఆయన ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తూ ఉంటారు. సినిమాలు లేకపోతే కుటుంబ సభ్యులతో గడపడం.. ఇంకా వీలుంటే విదేశాలకు ఫ్యామిలీతో స‌హా చెక్కేయ‌డం మహేష్‌కు అలవాటు. కాగా ప్రస్తుతం మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ టీనేజ్‌లోకి అడుగు […]

  • By: krs    latest    Jan 22, 2023 3:13 PM IST
మహేష్ బాబు కొడుకు పెద్దవాడయ్యాడు.. పాపం నమ్రత!

Mahesh babu , Namrata

మహేష్ బాబును ప్యూర్ జెంటిల్మెన్, ఫ్యామిలీ మెన్ అని చెప్పవచ్చు. ఆయనకు సినిమాల తర్వాత ఆయన కుటుంబమే ప్రపంచం. భార్యతో పాటు పిల్లలయిన గౌతమ్, సితారలతో ఆయన ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తూ ఉంటారు.

సినిమాలు లేకపోతే కుటుంబ సభ్యులతో గడపడం.. ఇంకా వీలుంటే విదేశాలకు ఫ్యామిలీతో స‌హా చెక్కేయ‌డం మహేష్‌కు అలవాటు. కాగా ప్రస్తుతం మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ టీనేజ్‌లోకి అడుగు పెట్టాడు. వయసు ప్రస్తుతం 16 సంవత్సరాలు. దాంతో ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

పిల్లలు టీనేజ్‌లోకి వచ్చే వరకు మాత్రమే వారికి తల్లిదండ్రులు దిశా నిర్దేశం చేయగలరు. టీనేజీలోకి ఎంటర్ అయినాక వారికంటూ సొంత నిర్ణయాలు ఉంటాయి. తమకు ఇష్టం వచ్చిన పనులు చేస్తారు. వాటిని తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. మంచి అల‌వాట్ల‌యితే ఎంక‌రేజ్ చేయాలి. త‌ప్పుడు నిర్ణయాలైతే హిత‌వు చెప్పాలి.

గౌతమ్ ఈమధ్య తనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి వస్తున్నాడు. గౌతమ్ వ్యక్తిగతంగా ఎంతో స్వ‌తంత్రంగా ఆలోచిస్తున్నాడు. ఇతడు మొదటిసారిగా తన తల్లిదండ్రులతో కాకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. తన క్లాస్మేట్స్ అందరూ వరల్డ్ కల్చరల్ టూర్‌కి వెళ్తున్నారు. వారితోపాటు గౌతమ్ కూడా విదేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు.

కాగా ఇంతకాలం తల్లిదండ్రుల చాటు బిడ్డగా పెరిగిన గౌతమ్.. ఇప్పుడు ఇలా సొంతంగా నిర్ణయం తీసుకొని విదేశాలకు వెళుతుండడంతో ఆయన తల్లి నమ్ర‌త హార్ట్ బ్రేకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో.. గౌతమ్ మొదటిసారి మా తోడు లేకుండా ఒక ట్రిప్పుకు వెళ్తున్నాడు. అతను ఇంటి నుంచి కాలు బయట పెట్టడం తలుచుకుంటే నాలోని సగం నన్ను వీడిపోయిన బాధ కలుగుతుంది. నేను ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. గౌతమ్‌కు రెక్కలొచ్చి గూడు నుండి ఎగిరిపోయాడు. తిరిగి నా కళ్ళ ముందుకు వచ్చేవరకు నా బాధ పోదు. గౌతమ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ ట్రిప్ గౌతమ్‌కి సరికొత్త అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని పోస్ట్ పెట్టింది.

రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు సహజంగానే తల్లిదండ్రులను విడిచి ఎగిరిపోతారు. రెక్కలొచ్చిన పక్షుల మాదిరిగా తమ నిర్ణయాలు తాము తీసుకుంటూ ఉంటారు. అడ్డాల నాడు బిడ్డలే గాని గడ్డాలు నాడు బిడ్డలు కాదు అనేది మనకి పెద్ద‌లు చెప్పిన సామెత‌. బిడ్డ పెరిగి గడ్డం వస్తే కన్నతల్లే అడ్డు అడ్డు అన్నట్టు వారి ప్రవర్తన ఉంటుంది. కానీ వారిని మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం వారికి తగిన స్వేచ్ఛను ఇవ్వాలి. ఇక గౌతమ్ ఇంట్లో లేకపోవడాన్ని న‌మ్ర‌తా తట్టుకోలేకపోతున్నట్టు చెప్పింది.

మరి మహేష్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడో ఇంకా తెలియలేదు. మహేష్ త‌న ఫ్యామిలీ మెంబ‌ర్ల‌ను, తమ పిల్లలను ప్రేమిస్తారు. ప్రపంచాన్ని వారి ముందుకు తీసుకుని వస్తారు. అడిగింది లేదనకుండా సమకూరుస్తారు. చిన్న వయసులోనే గౌతమ్, సితార చాలా మెచ్యూర్‌గా ఉంటున్నారు. సితార పదేళ్లకే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమెకు సామాజిక విషయాల పట్ల కూడా అవగాహన ఉంది. ప్రతి ఏటా ఆరేడు సార్లు వీరు విదేశాల‌కు టూర్స్‌కి వెళ్తారు. లోకంలో ఉన్న ప్రతి అందమైన ప్రదేశాన్ని, నగరాన్ని సందర్శిస్తూ.. ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారనే విషయం తెలియంది కాదు.