Mamata Banerjee | సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా సిలిగురిలోని ఎయిర్‌బేస్‌లో ఆమె హెలికాప్టర్‌ను పైలట్ ల్యాండ్ చేశారు. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార నిమిత్తం జల్‌పైగురికి మంగళవారం ఉదయం వెళ్లారు. ఎన్నికల ప్రచారం అయిపోగానే బాగ్దోరా ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరింది. అయితే భారీ వర్షం కారణంగా, వాతావరణం అనుకూలించక పోవడంతో.. సిలిగురి సమీపంలోని సేవోక్ ఎయిర్‌బేస్‌లో పైలట్ మమత హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేశారు. […]

Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా సిలిగురిలోని ఎయిర్‌బేస్‌లో ఆమె హెలికాప్టర్‌ను పైలట్ ల్యాండ్ చేశారు.
మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార నిమిత్తం జల్‌పైగురికి మంగళవారం ఉదయం వెళ్లారు. ఎన్నికల ప్రచారం అయిపోగానే బాగ్దోరా ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరింది. అయితే భారీ వర్షం కారణంగా, వాతావరణం అనుకూలించక పోవడంతో.. సిలిగురి సమీపంలోని సేవోక్ ఎయిర్‌బేస్‌లో పైలట్ మమత హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేశారు.
అనంతరం మమతా బెనర్జీ రోడ్డుమార్గంలో బాగ్దోరా ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లారు. అక్కడ్నుంచి ఆమె కోల్‌కతాకు వెళ్లారు. ఉత్తర వెస్ట్ బెంగాల్‌లో జులై 8న పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమత టీఎంసీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు.