Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఇంట్లోనే ట్రెడ్ మిల్‌పై మమత వర్క్ అవుట్ చేస్తున్న దృశ్యాన్ని ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
ఇక మమత తన చేతులతో ఓ కుక్క పిల్లను పట్టుకుని, దాని వైపు చూస్తూ వర్క్ అవుట్ చేశారు. కొన్ని రోజుల్లో మీకు కొంత అదనపు ప్రేరణ కావాలని మమత ఆ వీడియో క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో 10 కిలోమీటర్ల మేర జాగింగ్ చేసి.. వ్యాయామంపై అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే.
68 ఏండ్ల మమతా బెనర్జీ.. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. బీజేపీకి ఆమె బద్ధ శత్రువు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానని ఇటీవలే మమత ప్రకటించారు.
అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై భారతీజయ జనతా పార్టీని ఓడించాలని ఆమె ఇటీవలే పిలుపునిచ్చారు. జూమ్లా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకం కావాలన్నారు. భారతదేశం మార్పును కోరుకుంటుందని, శక్తివంతులైన ప్రజలు కదం తొక్కాలన్నారు.
View this post on Instagram