Heart Patients | హార్ట్ పేషెంట్స్‌కు వాకింగ్ దివ్యఔషధమా..?
Heart Patients | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్( Busy Life )ను గడుపుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా బీపీ( BP ), షుగర్( Sugar ), ఒబెసిటీ( Obesity ) వంటి రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు( Heart Stroke )కు కూడా గురవుతున్నారు.

Heart Patients | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్( Busy Life )ను గడుపుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా బీపీ( BP ), షుగర్( Sugar ), ఒబెసిటీ( Obesity ) వంటి రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు( Heart Stroke )కు కూడా గురవుతున్నారు. జీవనశైలి( Life Style )లో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్లే ఇలాంటి రోగాలు చుట్టుముడుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు కనీసం ఒక అర గంట పాటైనా వాకింగ్( Walking ) చేయాలని సూచిస్తున్నారు. మరి గుండె జబ్బులతో బాధపడేవారికి వాకింగ్ మంచిదేనా..? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రోజు ఉదయమో, సాయంత్రమో ఎప్పుడూ వీలు చిక్కితే అప్పుడు కనీసం ఒక అరగంట వాకింగ్ చేస్తే హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చున్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె సంబంధిత వారికి వాకింగ్ దివ్యఔషధం..!
నడక చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరికి నడవమంటేనే బద్దకం. ఒక్క అడుగు వేసేందుకే ఆయాసపడుతుంటారు. కానీ గుండె జబ్బులతో బాధపడే వారికి వాకింగ్‌కు మించిన మరో వ్యాయామం లేదని చెబుతున్నారు. నడక వారికి ఒక దివ్య ఔషధంలా పని చేస్తుందని సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హర్ట్ రేటు సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. వాకింగ్ వల్ల గుండె బలపడడమే కాకుండా రక్త ప్రసరణ కూడా సజావుగా సాగుతుంది. హర్ట్ రేటును పెంచే ఏ చర్య అయినా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వాకింగ్ చేసినప్పుడు కొంత మందికి ఛాతిలో నొప్పి రావడం, అయాసం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తే ఆపేడం మంచిది
నడకతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది..
గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి నడక మంచి వ్యాయామం. వాకింగ్ వల్ల గుండె వేగం, శ్వాసరేటు పెరిగేలా చేసి, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు బలోపేతమై ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల అధిక రక్తపోటు తగ్గడంతో పాటు, రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. నడకతో కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు కండరాల సామర్థ్యం మెరుగవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వాకింగ్ చేసేటప్పుడు హార్ట్ పేషెంట్స్ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలిస్టర్స్ దుస్తులు చెమటను బయటకు పోనియావని, అందుకే నడిచేటప్పుడు ఇలాంటి దుస్తులు ధరించకూడదు. మొదటి 5 నిమిషాలు చాలా నెమ్మదిగా నడవాలి. దీంతో శరీరం వ్యాయామం చేయడానికి చాలా అనువుగా తయారవుతుందన్నారు. ఇలా కాకుండా ఒకసారి వేగంగా నడవడం మొదలు పెడితే కండరాలు పట్టేయడం, కీళ్లు నొప్పులు ఇబ్బంది పెడతాయి. మొదట నడకను నిదానంగా మొదలు పెట్టిన తరువాత వేగం పెంచుకుంటూ పోవాలని, ఒకసారి వేగం పెంచిన తరవాత నెమ్మదిగా తగ్గించుకుంటూ పోవాలి.