Katihar | వివాహిత‌కు వేధింపులు.. యువ‌కుడికి అర గుండు గీసి, చెప్పుల దండేసి ఊరేగించారు

Katihar | విధాత‌: వివాహిత‌ను వేధిస్తున్న ఓ యువ‌కుడికి అర‌గుండు గీయించి, మెడ‌లో చెప్పుల దండేసి ఊరేగించారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని క‌తిహార్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌తిహార్ జిల్లాలోని క‌బ‌ర్‌కు చెందిన రాజీవ్ కుమార్ ఓ పిండి మిల్లును నిర్వ‌హిస్తున్నాడు. ఈ మిల్లులో ఆనంద్ అనే వ్య‌క్తి ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆనంద్.. రాజీవ్ ఇంటికి వెళ్లేవాడు. దీంతో రాజీవ్ భార్య‌తో ఆనంద్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక ఆనంద్, రాజీవ్ భార్య […]

Katihar | వివాహిత‌కు వేధింపులు.. యువ‌కుడికి అర గుండు గీసి, చెప్పుల దండేసి ఊరేగించారు

Katihar | విధాత‌: వివాహిత‌ను వేధిస్తున్న ఓ యువ‌కుడికి అర‌గుండు గీయించి, మెడ‌లో చెప్పుల దండేసి ఊరేగించారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని క‌తిహార్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌తిహార్ జిల్లాలోని క‌బ‌ర్‌కు చెందిన రాజీవ్ కుమార్ ఓ పిండి మిల్లును నిర్వ‌హిస్తున్నాడు. ఈ మిల్లులో ఆనంద్ అనే వ్య‌క్తి ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆనంద్.. రాజీవ్ ఇంటికి వెళ్లేవాడు. దీంతో రాజీవ్ భార్య‌తో ఆనంద్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక ఆనంద్, రాజీవ్ భార్య ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. గ‌త మూడు నెల‌ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, ఇంటికి వ‌స్తున్నానంటూ ఆనంద్ వేధిస్తున్నాడ‌ని ఆమె త‌న భ‌ర్త రాజీవ్‌కు చెప్పింది.

ఇక ఆనంద్‌ను రాజీవ్ కుటుంబ స‌భ్యులు ప‌ట్టుకుని క‌ట్టేశారు. అనంత‌రం విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. అంత‌టితో ఆగ‌కుండా అర గుండు గీయించి, మెడ‌లో చెప్పుల దండేసి ఊరేగించారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు తీవ్రంగా స్పందించారు. అమాయ‌కుడైన ఆనంద్‌పై రాజీవ్ కుటుంబ స‌భ్యులు అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆ మహిళే ఆనంద్‌కు తరచూ ఫోన్‌ చేసేదని, ఇంటికి రావాలని పిలిపించుకునేదని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరుపక్షాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో అనంతరం పోలీసులు అతడిని వదిలిపెట్టారు.