హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిని నగ్నంగా చేసి చితకబాదారు
Hyderabad | ఓ యువకుడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడి దుస్తులు విప్పించారు. నగ్నంగా ఉన్న ఆ యువకుడిపై బెల్ట్‌తో చితకబాదారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ ఇర్ఫాన్ అనే యువకుడు లంగర్‌హౌస్‌లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు యువకులు ఇర్పాన్‌ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రాజేంద్రనగర్ వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో ఇర్ఫాన్‌ను నగ్నంగా ఉంచారు. […]

Hyderabad | ఓ యువకుడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడి దుస్తులు విప్పించారు. నగ్నంగా ఉన్న ఆ యువకుడిపై బెల్ట్‌తో చితకబాదారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎండీ ఇర్ఫాన్ అనే యువకుడు లంగర్‌హౌస్‌లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు యువకులు ఇర్పాన్‌ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రాజేంద్రనగర్ వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో ఇర్ఫాన్‌ను నగ్నంగా ఉంచారు.
అనంతరం బెల్ట్‌తో వాతలు వచ్చేలా తీవ్రంగా చితకబాదారు. కొట్టకండి, కొట్టకండి అని మొరపెట్టుకున్న ఆ ముగ్గురు దుండగులు వినిపించుకోలేదు. రక్తం కారేలా కొట్టారు. మొత్తానికి ఆ దుండగుల నుంచి తప్పించుకున్న ఇర్ఫాన్ రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు.
తనపై దాడి చేసిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే యువకుడిని నగ్నంగా చేసి చితకబాదిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
HYDలో దారుణం.. యువకుడిని నగ్నంగా చేసి చితకబాదారు https://t.co/ayku7gTtZC pic.twitter.com/IY61GezSU2
— vidhaathanews (@vidhaathanews) December 7, 2022