Mancherial | వందేండ్లు దాటిన చెక్కుచెదరని పటిష్టత.. ఆ బ్రిడ్జి ఎక్కడో తెలుసా?

Mancherial | Bridge అప్పటి నిర్మాణాలను కొనియాడుతున్న ప్రజలు. నేటి గుత్తేదారులు, ఆప్పటి కాంట్రాక్టర్ పనితనాన్ని స్పూర్తిగా తీసుకోవాలంటున్న ప్రజలు . నేటి నిర్మాణలు నాటి బ్రిడ్జితో పోటీ పడతాయా? విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిపై నిర్మించిన రైల్వే వంతెన 102 ఏళ్లు గడుస్తున్నా పటిష్ఠంగా ఉంది. 1921లో నిజాం ప్రభుత్వం హయాంలో గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మాణం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైల్వే వంతెనగా […]

  • By: Somu    latest    Jul 12, 2023 11:14 AM IST
Mancherial | వందేండ్లు దాటిన చెక్కుచెదరని పటిష్టత.. ఆ బ్రిడ్జి ఎక్కడో తెలుసా?

Mancherial | Bridge

  • అప్పటి నిర్మాణాలను కొనియాడుతున్న ప్రజలు.
  • నేటి గుత్తేదారులు, ఆప్పటి కాంట్రాక్టర్ పనితనాన్ని స్పూర్తిగా తీసుకోవాలంటున్న ప్రజలు .
  • నేటి నిర్మాణలు నాటి బ్రిడ్జితో పోటీ పడతాయా?

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిపై నిర్మించిన రైల్వే వంతెన 102 ఏళ్లు గడుస్తున్నా పటిష్ఠంగా ఉంది. 1921లో నిజాం ప్రభుత్వం హయాంలో గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మాణం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైల్వే వంతెనగా మారింది . గుజరాత్ రాష్ట్రానికి చెందిన కర్శన్ లాల్ అనే కాంట్రాక్టర్ అప్పటి ఇంజనీర్ల పర్యవేక్షణలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య ఉన్న గోదావరి నదిపై 42 పిల్లర్లతో రైల్వే బ్రిడ్జిని నిర్మించడం జరిగింది.

ఇటీవల కాలంలో కొన్ని కట్టడాలు ఇలా కట్టగానే అలా కూలిపోతున్నాయి. నాణ్యతా లోపమో లేక మరే ఇతర కారణమో గాని కొన్ని నిర్మాణాలు మన్నికగా నిలువలేకపోతున్నాయి. అదే కొన్ని నిర్మాణాలు వందల ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా పటిష్టంగా నిలబడి ఉన్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య లో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణo జరిగి 100 ఏళ్ళు గడిచిన చెక్కుచెదరకుండా ఉండి నాటి వైభవానికి, నాటి నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందులో అది నిజాం కాలంనాటి నిర్మాణాలు కావడం విశేషం . రోడ్లు, వంతెనలు, నీటి పథకాలు, చెరువులు, ఆనకట్టలు ఇలా చాలానే ఉన్నాయి.

ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య కూడా వారిధిగా నిలిచింది. దాదాపు వందేళ్ళ క్రితం అంటే 1921 ప్రాంతంలో నిజాం ప్రభుత్వ హాయాంలో దీన్ని నిర్మించారు. ఈ వంతెనకు మొత్తం 42 ఫిల్లర్లు ఉండగా అందులో 21 పిల్లర్లు మంచిర్యాల పరిధిలోకి వస్తే, మరో 21 పిల్లర్లు పెద్దపెల్లి జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం వర్షకాలంలో గోదావరి ఉప్పొంది ప్రవహిస్తుంటుంది. కానీ ఎప్పుడు కూడా ఈ వంతెన నీట మునగలేదు. వరద ఉధృతికి చెక్కుచెదరనూ లేదు. ఒకేసారి రెండు రైళ్ళు వెళ్ళేలా రెండు వైపులా ట్రాక్ లను నిర్మించారు.

అప్పుడప్పుడు వంతెన పై నుండి కాలినడకన కూడ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ట్రాక్ పై రైలు వస్తే పాదాచారులు నిలబడటానికి ప్లాట్ ఫాం కూడా నిర్మించారు. ప్రయాణికుల సౌలభ్యం మూడవ లైన్ లో భాగంగా 2018లో దాని పక్కనే మరో వంతెన నిర్మించి మూడవ లైన్ న్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ రైల్వే బ్రిడ్జి కి కిలోమీటర్ దూరంలో పై భాగాన ప్రస్తుతం గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గామ ల మధ్య రహదారి వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు.

ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 164 కోట్లను మంజూరు చేశారు . గత నెల 9 సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా ఈ రహదారి వంతెన కు ప్రారంభోత్సవం చేశారు. ఈ వంతెన పూర్తయితే ప్రయాణికులకు దూరం భారం కొంతవరకు తగ్గనుంది. సాధారణంగా మంచిర్యాల నుండి గోదావరిఖని మీదుగా కరీంనగర్ జిల్లాకు వెళ్ళాలంటె కనీసం 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కనీసం 20 కిలో మీటర్ల దూరం ప్రయాణం తగ్గనుంది. దూర భారం తగ్గడమే కాకుండ వాణిజ్య పరంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు అభివృద్ది చెందే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే గత ఎన్నికల సమయంలో 4 సంవత్సరాల క్రితం మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ కు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వంతెన నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని హామి ఇచ్చారు. హమీ లో భాగంగానే కాగా ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏదిఏమైనప్పటికి నాటి వంతెన మాదిరి చెక్కుచెదరకుండా మన్నికగా ఉండేలా అన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించి పదికాలాలపాటు నిలిచేలా నిర్మాణం చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతురున్నారు.