ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ NTR
దేశంలో ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో సెలెబ్రిటీల ఫొటోలను విచ్చలవిడిగా, అభ్యంతరకరమైన రీతిలో వినియోగిస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. తన ఫొటోలను డిజిటల్ మీడియాలో వాడకుండా ఉండేందుకు తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
విధాత: దేశంలో ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో సెలెబ్రిటీల ఫొటోలను విచ్చలవిడిగా, అభ్యంతరకరమైన రీతిలో వినియోగిస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. తన ఫొటోలను డిజిటల్ మీడియాలో వాడకుండా ఉండేందుకు తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను విచారించిన హైకోర్టు జడ్జి మన్మీత్ ప్రీతమ్ సింగ్ మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు వేయాల్సిందిగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లను ఆదేశించారు.
తనకు తెలియకుండానే తన ఫొటోలు, తన పేరు, గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించే విధంగా ఈ కామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం లు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇలా వినియోగించడం ద్వారా డిజిటల్ మీడియా ఫ్లాట్ పారంలు ఆర్థికంగా లబ్ది పొందుతున్నాయన్నారు. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ 2021 ప్రకారం మూడు రోజుల్లో స్పందించాల్సిందిగా జడ్జీ ఆదేశించారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, అనీల్ కపూర్, అభిషేక్ బచ్చన్, కొణిదెల చిరంజీవితో పాటు ఇతర సెలెబ్రిటీలు కూడా తమ ఫొటోలు, వీడియోల వినియోగం పై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు వేశారు. ఈ పిటీషన్లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పిటీషన్ పై ఈ నెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేయనున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram