Manchu Family: ఎవరూ తగ్గడం లేదుగా.. సెగ్గడ్డ అంటూ మీడియాపై సెటైర్లు!

విధాత‌, సినిమా: ఆ మధ్య సోషల్ మీడియాలో కరోనా వైరస్‌కు సంబంధించి ఓ ఫోన్ కాల్ వైరల్ అయింది. అందులో ఒక ఆఫీసర్ ఫోన్ చేసి.. పలానా వాళ్లకి కరోనా అని చెప్పడానికి నానా తంటాలు పడతాడు. చివరికి అతని సహనం నశించి.. ఓరి మీ దుంపలు తెగ.. ఇలా విసిగిస్తున్నారేంట్రా! అని ఫోన్ పెట్టేస్తాడు. అలాగే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ తీరు ఉంది. ఒకరిని మించి ఒకరు తగ్గేదే లే అన్నట్లుగా నట […]

  • Publish Date - April 7, 2023 / 06:26 PM IST

విధాత‌, సినిమా: ఆ మధ్య సోషల్ మీడియాలో కరోనా వైరస్‌కు సంబంధించి ఓ ఫోన్ కాల్ వైరల్ అయింది. అందులో ఒక ఆఫీసర్ ఫోన్ చేసి.. పలానా వాళ్లకి కరోనా అని చెప్పడానికి నానా తంటాలు పడతాడు. చివరికి అతని సహనం నశించి.. ఓరి మీ దుంపలు తెగ.. ఇలా విసిగిస్తున్నారేంట్రా! అని ఫోన్ పెట్టేస్తాడు. అలాగే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ తీరు ఉంది. ఒకరిని మించి ఒకరు తగ్గేదే లే అన్నట్లుగా నట విశ్వరూపాలను బయటకు ప్రదర్శిస్తున్నారు.

రీసెంట్‌గా మంచు మనోజ్.. అన్న మంచు విష్ణు తన అనుచరుడిని కొట్టబోతున్నాడంటూ పెట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మనోజ్ రెండో పెళ్లిలో కూడా మంచు విష్ణు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ పెళ్లి ఆయనకు ఇష్టం లేదనేలా వార్తలు వైరల్ అయ్యాయి. కట్ చేస్తే.. మంచు మనోజ్ వీడియోకి కారణం.. ఏవో ఆస్తుల గొడవలు అని అంతా కామ్ అయిన సందర్భంలో మళ్లీ మంచు విష్ణునే ‘మంచు ఫ్యామిలీ రియాల్టీ షో’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అంటే మంచు మనోజ్ తీసిన పరువును కవర్ చేసుకునేందుకు విష్ణు ఏదో ప్లాన్ చేశాడనేలా ఆ వీడియోపై టాక్ నడిచింది. మరి మంచు ఫ్యామిలీలో ఇన్ని నాటకాలు నడుస్తున్నప్పుడు మీడియా ఫోకస్ చేయకుండా ఉంటుందా? తప్పకుండా చేస్తుంది.

తాజాగా మంచు మోహన్ బాబు, భార్యతో కలిసి మంచు మనోజ్ తిరుపతిలోని ఓ హాస్పిటల్‌ ఓపెనింగ్‌కు వచ్చారు. ఓపెనింగ్ అనంతరం.. మంచు విష్ణు షేర్ చేసిన ‘మంచు రియాల్టీ షో’ గురించి స్పందించాలని కోరారు. దీనికి మోహన్ బాబు ఒక రకంగానూ, మంచు మనోజ్ మరో రకంగానూ మాట్లాడి మీడియాకు మరింత పని కల్పించారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి.. మీ ఇళ్లలో కూడా ఉంటాయి.. మీ భార్యలతో జరిగే గొడవలని, మీ మధ్య ఉన్న సమస్యలని చెప్పమంటే చెబుతారా? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మీరు అడిగే ప్రశ్నలు ఏమిటి? అంటూ మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఇక మంచు మనోజ్ అయితే మీడియాని ఎగతాళి చేసి మాట్లాడాడు.

‘నాకు చిన్న సగ్గెడ్డ వచ్చింది.. బాగా దురదగా ఉంది.. గోకుతారా?’ అంటూ మంచు మనోజ్ ఎటకారపు మాటలతో మీడియాని హర్ట్ చేశాడు. మరి దీని ఎఫెక్ట్ ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఇదంతా చూసిన వారు మాత్రం.. పైన ఆఫీసర్ ఫైనల్‌గా ఎలా రియాక్ట్ అయ్యాడో అలా అనుకుంటున్నారు. అది విషయం.

Latest News