Maneru River | పూడికతీత నిరంతర ప్రక్రియ.. ఆపేస్తే ఎలా?: NGTకి హైకోర్టు ఆదేశాలు
Maneru River పిటిషనర్ వాదనలు వినాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు హైకోర్టు ఆదేశాలు వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పూడికతీత పనులు ఆపేస్తే ఎలా? తదుపరి విచారణ జూలై 5కు వాయిదా హైదరాబాద్, విధాత: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మానేరు నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించి పిటిషనర్ వాదనలు వినాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరిగి విచారణ చేపట్టి సరైన తీర్పునివ్వాలని స్పష్టం చేసింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. మానేరు […]
Maneru River
- పిటిషనర్ వాదనలు వినాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు హైకోర్టు ఆదేశాలు
- వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పూడికతీత పనులు ఆపేస్తే ఎలా?
- తదుపరి విచారణ జూలై 5కు వాయిదా
హైదరాబాద్, విధాత: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మానేరు నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించి పిటిషనర్ వాదనలు వినాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరిగి విచారణ చేపట్టి సరైన తీర్పునివ్వాలని స్పష్టం చేసింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
మానేరు నదిలో పూడికతీత పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ గడీల రఘువీరారెడ్డి, ఇతరులు ఎన్జీటీలో దావా వేశారు. తవ్వకాలు చేపట్టకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీన్ని విచారణకు చేపట్టిన ఎన్జీటీ.. విచారణను జూలై 5కు వాయిదా వేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు ఎక్స్ పార్టీ నోటీసులు జారీ చేసింది.
మే 31న ఎన్జీటీ ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, కావేరీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
వాదనలు విన్న ధర్మాసనం.. పూడికతీత అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొంది. ఈ ప్రక్రియను ఆపివేస్తే వరదల సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పూడికతీత పనులు ఆపాలని ఎన్జీటీ పేర్కొనడాన్ని తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలో ఎన్జీటీ జారీ చేసిన ఎక్స్‌పార్టీ నోటీసులను కొట్టివేస్తున్నామంది. పూడికతీత కోసం కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆరు నెలల్లో దీన్ని సవాల్ చేయాల్సి ఉంటుందని, ఎన్జీటీని ఆశ్రయించిన పిటిషనర్లు అది పూర్తయ్యాక దావా వేశారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందన్న వివరాల మేరకు.. పిటిషనర్ల వాదనలు వినాలని ఎన్జీటీని ఆదేశించింది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram