అతగాడితో పెళ్లి పీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన సింగర్

ఇటీవల సెలబ్రిటీల పెళ్లికి సంబంధించి జోరుగా ప్రచారాలు సాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పలానా హీరో పలానా అమ్మాయితో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెగ పుకార్లు పుట్టించేస్తున్నారు. రామ్ పోతినేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోరుగా ప్రచారాలు సాగాయి.
ఆ తర్వాత భీమ్లా నాయక్ నటి మౌనిక రెడ్డి విడాకులు తీసుకుందని ప్రచారం చేశారు. ఇలా సినీ సెలబ్రిటీలకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. .ఇక గత నాలుగైదు రోజుల నుండి సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారాలు మంగ్లీ కంట కూడా పడడంతో అమ్మడు స్పందించి వాటికి చెక్ పెట్టింది.
ఇప్పుడు జానపద పాటలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ముందు న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసిన ఈమె ఆ తర్వాత మెల్లగా సింగర్ అవతారం ఎత్తింది. ఆమె పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.
శైలజా రెడ్డి అల్లుడు, నీది నాకే ఒక కేథ, జార్జ్ రెడ్డి, అలా వైకుంఠ పురం, సిటీమార్, లవ్ స్టోరీ, రంగ్ దే, అల్లుడు అదుర్స్, క్రాక్, పెళ్లి సందడి, పుష్ప (కన్నడ), రౌడీ బాయ్స్, ధమకా, బలగం, భోళాశంకర్ తదితర సినిమాల్లో మంగ్లీ ఆలపించిన పాటలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, మాస్ సాంగ్స్, సినిమా సాంగ్స్ ఇలా ఎలాంటి పాట అయిన తన గొంతు నుండి వచ్చిందంటే ఆ పాట సూపర్ హిట్ కావల్సిందే.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజియెస్ట్ సింగర్ గా మారిన మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మంగ్లీకి పెళ్లి ఈడు రావడంతో ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని తెగ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ సింగర్ తన బావతో కలిసి ఏడడుగులు నడవనుందని ప్రచారం చేశారు.
అయితే ఈ ప్రచారాల నడుమ మంగ్లీ ఎట్టకేలకు స్పందించింది.నాకు తెలియని బావ ఎక్కడినుండి వచ్చాడో , అసలు నాక్కూడా తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారు భగవంతుడా అంటూ మంగ్లీ షాక్‌కి గురైంది. ఇప్పట్లో తను పెళ్లి చేసుకోనని మంగ్లీ చెప్పడంతో పెళ్లి వార్తలకి పులిస్టాప్ పడింది.