Mangoes | ఓ రైతు అత్యుత్సాహం.. రూ. 2.5 ల‌క్ష‌ల విలువైన మామిడి పండ్లు చోరీ..!

Mangoes | ఓ రైతు అత్యుత్సాహం నిలువునా ముంచింది. త‌న పొలంలో పండిన మామిడి పండ్ల గురించి వివిధ సోష‌ల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశాడు. అంతే కాదు తాను పెంచిన మామిడి ర‌కాల్లో ఒక ర‌కం మామిడి పండ్లు భారీ ధ‌ర ప‌లుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆ పండ్ల ధ‌ర కిలో రూ. 2.5 ల‌క్ష‌లు అని ఆ రైతు తెలిపాడు. ఇంకేముంది త‌న అత్యుత్సాహానికి త‌గిన శాస్తి జ‌రిగింది. అలా షేర్ చేశాడో లేదో.. […]

  • By: krs    latest    Jun 20, 2023 9:36 AM IST
Mangoes | ఓ రైతు అత్యుత్సాహం.. రూ. 2.5 ల‌క్ష‌ల విలువైన మామిడి పండ్లు చోరీ..!

Mangoes |

ఓ రైతు అత్యుత్సాహం నిలువునా ముంచింది. త‌న పొలంలో పండిన మామిడి పండ్ల గురించి వివిధ సోష‌ల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశాడు. అంతే కాదు తాను పెంచిన మామిడి ర‌కాల్లో ఒక ర‌కం మామిడి పండ్లు భారీ ధ‌ర ప‌లుకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఆ పండ్ల ధ‌ర కిలో రూ. 2.5 ల‌క్ష‌లు అని ఆ రైతు తెలిపాడు. ఇంకేముంది త‌న అత్యుత్సాహానికి త‌గిన శాస్తి జ‌రిగింది. అలా షేర్ చేశాడో లేదో.. ఇలా దొంగ‌లు ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని నౌప‌డాలోని ల‌క్ష్మీనారాయ‌ణ అనే రైతు త‌న పొలంలో 38 ర‌కాల మామిడి పండ్ల చెట్ల‌ను పెంచుతున్నాడు. అయితే ఈ ర‌కాల్లో ఒక ర‌కం మామిడి పండ్లు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.5 ల‌క్ష‌లు ప‌లుకుతున్నాయ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు.

అంతేకాకుండా ఆ చెట్ల ఫోటోల‌ను, ఆ ర‌కం మామిడి పండ్ల‌ను కూడా షేర్ చేశాడు. ఫోటోలు సోష‌ల్ మీడియాలో చేసిన ఒక్క‌రోజులోనే ఆ రైతు తోట‌లో దొంగ‌లు ప‌డ్డారు. విలువైన నాలుగు మామిడి పండ్ల‌ను దొంగ‌లు అప‌హ‌రించారు. దీంతో రైతు ల‌బోదిబోమ‌న్నాడు. ఇక త‌న తోట‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.