Karimnagar | చిగురుమామిడి మండలంలో ఎలుగుబంటి కలకలం.. రైతుపై దాడి

Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతుపై దాడి చేసింది. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల బాలయ్య సోమవారం తెల్లవారుజామున 5గంటలకు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళుతున్న క్రమంలో ఉల్లంపల్లి రోడ్ పొట్టి గుట్ట సమీపంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో ఆయన చేతికి తీవ్రగాయమైంది.వెంటనే స్థానికులు బాలయ్యను చికిత్స నిమిత్తం హుస్నాబాద్ […]

  • By: Somu |    latest |    Published on : Jul 03, 2023 8:59 AM IST
Karimnagar | చిగురుమామిడి మండలంలో ఎలుగుబంటి కలకలం.. రైతుపై దాడి

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతుపై దాడి చేసింది.

బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల బాలయ్య సోమవారం తెల్లవారుజామున 5గంటలకు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళుతున్న క్రమంలో ఉల్లంపల్లి రోడ్ పొట్టి గుట్ట సమీపంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దాడిలో ఆయన చేతికి తీవ్రగాయమైంది.వెంటనే స్థానికులు బాలయ్యను చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు