Manipur | మా ఇంటిని తగులబెట్టారు.. సంపాదన సహా సర్వస్వం కోల్పోయాం! భారత ఫుట్‌బాలర్
Manipur | Chinglensana Singh నా ఫుట్‌బాల్ టర్ప్‌ను కాల్చేశారు తల్లిదండ్రులు తృటిలో తప్పించుకున్నారు మణిపూర్‌కు చెందిన భారత ఫుట్‌బాలర్ చింగ్‌లెన్సానా సింగ్ తీవ్ర ఆవేదన విధాత: మణిపూర్‌లో హింస అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. కుటుంబసభ్యులను మింగి అనేక మందిని అనాథలుగా మార్చుతున్నది. సర్వం కోల్పోయి రోడ్డున పడేలా చేస్తున్నది. సంపాదనసహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిలిగిన భారత ఫుట్‌బాలర్ విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మణిపూర్ హింసలో చురాచంద్‌పూర్ జిల్లా ఖుముజామా లైకైకి […]

Manipur | Chinglensana Singh
- నా ఫుట్‌బాల్ టర్ప్‌ను కాల్చేశారు
- తల్లిదండ్రులు తృటిలో తప్పించుకున్నారు
- మణిపూర్‌కు చెందిన భారత ఫుట్‌బాలర్
- చింగ్‌లెన్సానా సింగ్ తీవ్ర ఆవేదన
విధాత: మణిపూర్‌లో హింస అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. కుటుంబసభ్యులను మింగి అనేక మందిని అనాథలుగా మార్చుతున్నది. సర్వం కోల్పోయి రోడ్డున పడేలా చేస్తున్నది. సంపాదనసహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిలిగిన భారత ఫుట్‌బాలర్ విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
మణిపూర్ హింసలో చురాచంద్‌పూర్ జిల్లా ఖుముజామా లైకైకి చెందిన భారత ఫుట్‌బాలర్ చింగ్‌లెన్సానా సింగ్ కుటుంబం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడింది. ఇన్నాళ్లు తన కుటుంబం సంపాదించిన మొత్తం బుగ్గిపాలైందని చింగ్‌లెన్సానా సింగ్ ఆవేదన వ్యక్తంచేశాడు. తమ ఇంటితోపాటు, ఫుట్‌వాల్ టర్ఫ్‌ను కాల్చేశారని, ఆందోళనకారుల దాడిలో తన తల్లిదండ్రులు తృటిలో తప్పించుకున్నారని తెలిపాడు.
హింస చెలరేగిన రోజు.. కేరళలోని కోజికోడ్‌లో మోహన్ బగాన్‌తో జరిగిన ఏఎఫ్‌సీ కప్ ప్లే-ఆఫ్ (ఆసియా కాంటినెంటల్ టోర్నమెంట్) మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ తరపున తాను అడుతున్నట్టు చింగ్‌లెన్సాసనా చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫోన్ చూసుకోగా, టెక్ట్స్ మెస్సేజ్‌లు, మిస్డ్ కాల్స్‌తో ఫోన్ నిండి పోయిందని తెలిపాడు. ఆందోళనకారులు తమ ఇంటిని తగుల బెట్టినట్టు తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించాడు.
“ఆందోళనకారుల హింస మాకు చెందిన ప్రతిదీ. మేము సంపాదించిన ప్రతిదీ, మేము కలిగి ఉన్న ప్రతిదాన్ని బుగ్గిపాలు చేసింది. మా ఇల్లు తగులబడిపోయింది. చురచంద్‌పూర్‌లో నేను నిర్మించిన ఫుట్‌బాల్ (మైదానంలో పరిచ్చే గడ్డివంటిది) టర్ఫ్‌ను కాల్చేశారు. ఈ దారుణ ఘటన నాకు గుండె కోతను మిగిల్చింది ” అని చింగ్‌లెన్సాసనా ఆవేదన వ్యక్తం చేశాడు.
“యువకులకు ఫుట్‌బాల్ నేర్పించాలనే నాకున్న పెద్ద కలను ఆందోళనకారులు కాల్చేశారు. అదృష్టవశాత్తూ, నా కుటుంబం హింస నుంచి తప్పించుకుంది. సహాయ కేంద్రానికి తరలి వెళ్లింది. అయితే మేము మళ్లీ కొత్తం జీవితం ప్రారంభిస్తాం ” అని 27 ఏళ్ల ఆటగాడు కన్నీటి పర్యంతమై చెప్పాడు.
ఈ ఏడాది మే నెలలో కూకీ, మైతీ వర్గాల మధ్య మొదలైన హింస ఇప్పటికీ రావణకాష్టంలో మండుతూనే ఉన్నది. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 140 మంది వరకు చనిపోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. వేల కుటుంబాలు మణిపూర్‌ను వీడుతున్నాయి.