Maoist leader RK | ఆర్కే భార్యను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
Maoist leader RK విధాత: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఎన్‌ఐఏ ప్రకాశం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల శిరీష ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. విజయవాడలో దుడ్డు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ ఆ వెంటనే శిరీషను అదుపులోకి తీసుకుని తరలించడం గమనార్హం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో స్పెషల్ పోలీసులు శిరీష ఇంటిని చుట్టుముట్టి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులను నెట్టివేసి మరీ పోలీస్ వాహనంలో […]

Maoist leader RK
విధాత: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఎన్‌ఐఏ ప్రకాశం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవల శిరీష ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. విజయవాడలో దుడ్డు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ ఆ వెంటనే శిరీషను అదుపులోకి తీసుకుని తరలించడం గమనార్హం.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో స్పెషల్ పోలీసులు శిరీష ఇంటిని చుట్టుముట్టి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులను నెట్టివేసి మరీ పోలీస్ వాహనంలో తరలించారు.
సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడైన ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ 2021ఆక్టోబర్ 14న దక్షిణ బస్తర్‌లో అనారోగ్యంతో మృతి చెందినట్లుగా అప్పట్లో మావోయిస్టు పార్టీ ప్రకటించింది.