Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత సుధీర్ హతం!

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు.

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత సుధీర్ హతం!

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల్లో మావోయిస్టు నేత సుధీర్ అలియాస్ సుధాకర్ ఉన్నారని..ఆయనపై కోటి రూపాయల నగదు రివార్డు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోందని చెప్పారు. మార్చి 20న బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లలో 5గురు చనిపోయారు. దీంతో గడిచిన 85 రోజుల్లో ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 125 మంది మావోయిస్టులు చనిపోయారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (డీఐజీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రిజొల్యూట్ యాక్షన్ (కోబ్రా), సీఆర్ఫీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త బలగాలు ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల వేట సాగిస్తున్నాయి.

2026 మార్చి 31వరకు మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ దండకారణ్యం.. అబూజ్ మడ్ అడవుల్లోనే సెంట్రల్ రీజినల్ కమిటీ, తెలంగాణ కమిటీ, దక్షిణ బస్తర్ కమిటీలున్నాయి. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ పీఎల్జీఏ కంపెనీ 1 కమాండర్ హిడ్మా ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడన్న సమాచారంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతూ ముందుకెళుతున్నాయి.