Congress MLA | కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టుల కాల్పులు
Congress MLA | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించారు. బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి మంగళవారం సాయంత్రం ఓ బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పంచాయతీ అధికారి పార్వతి కశ్యప్ ప్రయాణిస్తున్న కారుపై కూడా మావోయిస్టులు తూటాల […]

Congress MLA | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించారు. బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి మంగళవారం సాయంత్రం ఓ బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు తుపాకులతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పంచాయతీ అధికారి పార్వతి కశ్యప్ ప్రయాణిస్తున్న కారుపై కూడా మావోయిస్టులు తూటాల వర్షం కురిపించారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం, గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ దాడులు జరిగాయి. 2019 ఏప్రిల్‌లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మాండవి వాహనంపై దతంతేవాడ ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులు జరపగా ఆయన అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.