Marriage | కులాంతర వివాహం.. వధువును బలవంతంగా తీసుకెళ్లిన సోదరులు
Marriage | కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతిని ఆమె సోదరులు బలవంతంగా తీసుకెళ్లారు. ఓ సినిమా రేంజ్‌లో ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన బీహార్‌లోని ఆరారియా పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆరారియా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు గత కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయితే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు […]

Marriage | కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతిని ఆమె సోదరులు బలవంతంగా తీసుకెళ్లారు. ఓ సినిమా రేంజ్‌లో ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన బీహార్‌లోని ఆరారియా పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
ఆరారియా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు గత కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయితే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లైన కొద్ది రోజులకు వధువు సోదరులు.. వరుడి ఇంటికి వచ్చారు. ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్నారు. యువతి వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ బైక్‌ను వేగంగా ముందుకు పోనిచ్చారు.
ఇక యువకుడి తండ్రిపై కూడా ఆమె సోదరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.