కార్ కొనాలనుకుంటున్నారా..? రూ.2లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న సుజుకీ..!
జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని వాహనాలకు భారీగా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నది

విధాత: జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని వాహనాలకు భారీగా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నది. కార్ల కొనుగోలుపై రూ.2.21లక్షల వరకు బెనిఫిట్స్‌ను వర్తింపజేస్తున్నది. డిసెంబర్‌లో నెక్సా మోడల్ కారుపై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నది. ఇగ్నిస్ మేన్యువల్ మోడల్‌పై రూ.40వేలు, ఏఎంటీ వర్షెన్‌పై రూ.35వేల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇందులో రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నది.
మరోవైపు బలెనో సీఎన్‌జీ, పెట్రోల్ వేరియంట్లపై రూ.25వేలు, రూ.30వేల విలువ చేసే క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తున్నది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ సైతం ఉన్నాయి. మారుతీ సుజుకీ సియాజ్పై రూ.25వేల క్యాష్ డిస్కౌంట్ పొందే వీలున్నది. మారుతీ సుజుకీ జిమ్నీపై ఏకంగా రూ.2.16లక్షల వరకు బెనిఫిట్స్ అవకాశం ఉన్నది. అయితే, కొత్తగా రిలీజ్ అయిన మారుతీ సుజుకీ జిమ్నీ థండర్ ఎడిషన్‌కి సైతం ఆఫర్‌ను వర్తింపజేస్తున్నది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ పెట్రోల్, టర్బో పెట్రోల్ వేరియంట్స్‌పై రూ.15వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ పొందేవీలున్నది. అదే సమయంలో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలో ఎంపిక చేసిన వేరియంట్స్‌పై రూ.15వేల వరకు డిస్కౌంట్స్, రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందగలుగుతారు. సీఎన్‌జీ వేరియంట్‌పై ఎలాంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. వీటితో పాటు స్క్రాపేజ్ బోనస్‌ని సైతం మారుతీ ప్రకటించింది. ఇది రూ.30వేలు ఉండనున్నది.
అయితే, ఆ ఆఫర్లన్నీ కేవలం డిసెంబర్ వరకేనని కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. వచ్చే జనవరి నుంచి కార్ల ధరలను మారుతి సుజుకీ పెంచబోతున్నది. ఇప్పటికే ధరల పెంపుపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేసింది. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడంతో తప్పనిసరిగా కార్ల ధరలు పెంచక తప్పడం లేదని చెప్పింది. అయితే, ఎంత మేరకు పెంచుతుందో మాత్రం కంపెనీ తెలుపలేదు. రాబోయే రోజుల్లో ఎంత మేరకు పెంచనున్నదో ప్రకటించే అవకాశం ఉన్నది.