విధాత: రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్(Congress) దేశవ్యాప ఉద్యమాలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రాహుల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ(AICC) సుదీర్ఘ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ(MP)లు అందరూ మూకుమ్మడి రాజీనామాలు(Resignations) చేస్తే ఎలా ఉంటుందన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Telangana BJP | మా దారి మేం చూసుకుంటాం.. BJP పెద్దలను కలిసిన ఈటల, రాజగోపాల్‌రెడ్డి
రాబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా బీజేపీ(BJP)కి తగిన సమాధానం ఇద్దామని కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సూచించినట్టు సమాచారం. రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం తీర్మానించింది. రాబోయే రోజుల్లో ఆందోళన ఎలా ఉండాలన్న విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఒక కమిటీని(Committee)కూడా ఏర్పాటు చేశారు.
రాహుల్‌గాంధీ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఒకప్పడు అనర్హత వేటుకు గురైనవారే. జైల్లో కొద్దికాలం గడిపినవారే. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 1975 జూన్ 12న అప్పటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్‌లాల్ సిన్హా ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. ఆ సమయంలో కొంతకాలం ఆమె జైలు శిక్ష అనుభవించారు. ఇదే పద్ధతిలో మనుమడు రాహుల్ గాంధీ కూడా అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.