హైలైట్స్:

  • అనుమతి లేని ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు
  • అక్కడే భారీస్థాయిలో ఆకస్మిక హిమపాతం

విధాత: సిక్కింలో ఘోరం చోటు చేసుకున్నది. అకస్మాత్తుగా సంభవించిన భారీ హిమపాతంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకున్నారు. కొందరిని రక్షించినా.. ఏడుగురు చనిపోయారు. 80 మంది వరకు మంచు కింద కూరుకుపోయినట్టు భయపడుతున్నారు. ఈ ఘటన గ్యాంగ్‌టక్‌ను నాథులాతో (Nathula) కలిపే జవహర్‌లాల్‌నెహ్రూ రోడ్డులోని 15వ మైలు వద్ద చోటు చేసుకున్నది.