Python Attack | భారీ కొండచిలువతో.. జూ కీపర్‌ ముఖాముఖి

Python Attack | విధాత: జూ పార్కుల్లో పాములతో డీల్‌ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో సుశిక్షితులైతే తప్ప.. పాముల మధ్య పనిచేయలేరు. ఈ జూ కీపర్‌ అలాంటి సుశిక్షితుడు కాబట్టే.. బుసలు కొడుతూ ముఖంపై దాడి చేసేందుకు (Python Attack) ఎగిరెగిరి పడుతున్న అప్పుడే గుడ్లు పెట్టిన భారీ కొండచిలువను నవ్వుతూనే నిలువరించగలిగాడు. డేరింగ్‌ జాబ్‌.. అంటూ నెటిజన్లు ఆయన పనికి ఫిదా అవుతున్నారు. ఐ లవ్‌ దిస్‌ జాబ్‌ జే బ్రీవర్‌ అనే […]

Python Attack | భారీ కొండచిలువతో.. జూ కీపర్‌ ముఖాముఖి

Python Attack |

విధాత: జూ పార్కుల్లో పాములతో డీల్‌ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో సుశిక్షితులైతే తప్ప.. పాముల మధ్య పనిచేయలేరు. ఈ జూ కీపర్‌ అలాంటి సుశిక్షితుడు కాబట్టే.. బుసలు కొడుతూ ముఖంపై దాడి చేసేందుకు (Python Attack) ఎగిరెగిరి పడుతున్న అప్పుడే గుడ్లు పెట్టిన భారీ కొండచిలువను నవ్వుతూనే నిలువరించగలిగాడు. డేరింగ్‌ జాబ్‌.. అంటూ నెటిజన్లు ఆయన పనికి ఫిదా అవుతున్నారు.

ఐ లవ్‌ దిస్‌ జాబ్‌

జే బ్రీవర్‌ అనే అమెరికన్‌ యూట్యూబర్‌.. రెప్టైల్‌ జూ ప్రీహిస్టారిక్‌ ఐఎన్‌సీ అనే కంపెనీకి వ్యవస్థాపక సీఈవో. తన జూలోని పాములకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్‌ చేసిన వీడియోను చూసి నెటిజన్లు దడుచుకుంటున్నారు. ఇలాంటి చోట పని చేయాలంటే డేర్‌ ఉండాలని అంటున్నారు.

వీడియోలో ఏమున్నదంటే.. ఒక భారీ కొండచిలువ అప్పడే గుడ్లు పెట్టింది. వాటిని నిపుణుల సాయంతో పొదిగించేందుకు గుడ్లు తీసేందుకు బ్రీవర్‌ ప్రయత్నించారు. కానీ.. బ్రీవర్‌ను అడ్డుకునేందుకు కొండచిలువ ఆయన ముఖంపైన దాడి చేసేందుకు ఒక్కసారిగా ముందుకు వచ్చింది. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన బ్రీవర్‌.. కొండచిలువ గుడ్లను కాపాడేందుకు చేసే పని ఎంతో ప్రమాదకరం. కానీ.. మంచి విషయం ఏమిటంటే.. నేను చేస్తున్న పనిని ప్రేమిస్తా’ అని రాశారు.

పిచ్చోడివా?

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. మీరు సాహసులో పిచ్చోళ్లో నాకు తెలియదు కానీ.. జాగ్రత్తగా ఉండండి.. అని ఒక వ్యక్తి కామెంట్‌ చేశారు. ‘మిమ్మల్ని భయపెట్టడానికే అది అలా ముందుకు దూకి ఉంటుంది.. మిమ్మల్ని కాటు వేయడానికి కాదేమో’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒకాయనైతే ‘ఇలాంటి వీడియోలు చూస్తే ఏదో ఒక రోజు నాకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చి పోతానేమో’ అంటూ భయపడిపోయాడు.

గరిష్ఠ పొడవు 31.5 అడుగులు!

ఈ వీడియోలో కనిపించిన తరహా కొండచిలువలు దక్షిణాసియా, ఆగ్రేయాసియాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ప్రపంచంలోనే పెద్ద పాములు. కోళ్లు, కుక్కలనే కాదు.. మనుషులను కూడా మింగేయగలవు. ఈ పాములు గరిష్ఠంగా 31.5 అడుగుల వరకూ పెరుగుతాయట!

కాలిఫోర్నియాలోని ఫౌంటెయిన్‌ వ్యాలీలో ఉన్న ఈ పాముల పార్క్‌లో వందల రకాల సర్పాలు ఉన్నాయి. పాములే కాదు.. అనేక రకాల మొసళ్లు, తాబేళ్లు కూడా ఉంటాయి