ప్రముఖ నటుడి మరణం.. మాయిల్ స్వామి చివరి కోరిక తీరుస్తా: రజనీకాంత్
విధాత: ప్రముఖ తమిళ నటుడు మాయిల్ స్వామి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన మృత్యువాత పడ్డారు. మాయిల్ స్వామి మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాయిల్ స్వామి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మాయిల్ స్వామి భౌతిక దేహానికి నివాళులర్పించారు. ఎమ్జీఆర్, శివుడి గురించి మాత్రమే.. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. అతనికి 23 […]

విధాత: ప్రముఖ తమిళ నటుడు మాయిల్ స్వామి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన మృత్యువాత పడ్డారు. మాయిల్ స్వామి మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాయిల్ స్వామి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మాయిల్ స్వామి భౌతిక దేహానికి నివాళులర్పించారు.
ఎమ్జీఆర్, శివుడి గురించి మాత్రమే..
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. అతనికి 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయి నుంచి నటుడి స్థాయికి ఎదిగారు. అతడు ఎమ్జీఆర్‌కు వీరాభిమాని. మహాశివుడి పరమ భక్తుడు. మేము తరచూ కలిసే వాళ్ళం. నేను అతన్ని సినిమా గురించి అడిగేవాడ్ని. కానీ అతడు ఎమ్జీఆర్, శివుడి గురించి మాత్రమే చెప్పేవాడు. మేము మంచి స్నేహితులం. కానీ ఎక్కువ సినిమాల్లో కలిసి నటించలేదు. ఎందుకో తెలియదు.
ఫోన్ చేశారు.. కానీ..
ఆయన ప్రతి సంవత్సరం కార్తీకదీపం రోజున తిరుణ్ణామలై వెళ్తారు. భక్తులను చూసి సంతోషించేవారు. కార్తీకదీపం రోజు అక్కడికి వెళ్దామని చెప్పేవాడు. నాకు కొన్ని నెలల క్రితం ఫోన్ చేశారు. నేను పని ఒత్తడిలో బిజీగా ఉండి ఫోన్ తీయలేదు. కానీ ఇప్పుడు ఆయనే లేరు. మాయిల్ స్వామి శివరాత్రి రోజు చనిపోయారు. అది దేవుడి నిర్ణయం. తన ప్రియ భక్తున్ని దేవుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. నేను తిరువన్నామలై గుడి దర్శించుకుంటే చూడాలని ఆయన అనుకున్నారు. ఇదే విషయాన్ని డ్రమ్స్ శివమణికి చెప్పారు. నేను శివమణితో మాట్లాడాను. మాయిల్ స్వామి కోరికను తీరుస్తాను.. అని అన్నారు.