Telangana: తెలంగాణలో మెక్ డొనాల్డ్స్ భారీ పెట్టుబడులు!

తెలంగాణలో భారీ పెట్డుబడులకు అమెరికా బహుళజాతి సంస్థ మెక్ డొనాల్డ్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

Telangana: తెలంగాణలో మెక్ డొనాల్డ్స్ భారీ పెట్టుబడులు!

Telangana: తెలంగాణలో భారీ పెట్డుబడులకు అమెరికా బహుళజాతి సంస్థ మెక్ డొనాల్డ్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మెక్‌డొనాల్డ్స్ చైర్మన్ , సీఈవో క్రిస్ కెంప్చిన్స్కి తో పెట్టుబడులు.. ఉపాధి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఓప్పందంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు, యువతకు వ్యాపార అవకాశాలు రానున్నాయి.

తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో గట్టి పోటీని ఎదుర్కొని మెక్‌డొనాల్డ్స్ డీల్‌ని సంపాదించింది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ తెలంగాణలో రాబోతోంది. తెలంగాణను స్కిల్లింగ్ హబ్‌గా మార్చి, ఇండియా, విదేశాల్లోని మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల కోసం సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వబోతోంది. రైతుల నుంచి కొనుగోలు, స్థానిక ఉత్పత్తులతో జాతీయ, గ్లోబల్ మార్కెట్‌లోకి వెళ్లడం తెలంగాణకు పెద్ద విజయంగా ప్రభుత్వం భావిస్తుంది.