Medak Farmer | రూ. 50 ల‌క్ష‌ల ఫార్చున‌ర్ కారు కొన్న ట‌మాటా రైతు..

Medak Farmer | ట‌మాటా సాగు చేసిన రైతులు ఎవ‌రూ న‌ష్ట‌పోలేదు. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే కోటీశ్వ‌రులైపోయారు. ట‌మాటా ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. ఆ పంట వేసిన రైతులు భారీగా లాభాలు గ‌డించారు. అలా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ట‌మాటాలు అమ్మి ధ‌నికులైన రైతుల జాబితాలో మ‌న మెద‌క్ జిల్లాకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి చేరాడు. అంతేకాదు.. రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే టయోటా ఫార్చున‌ర్ కారు కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించాడు ఈ […]

Medak Farmer | రూ. 50 ల‌క్ష‌ల ఫార్చున‌ర్ కారు కొన్న ట‌మాటా రైతు..

Medak Farmer |

ట‌మాటా సాగు చేసిన రైతులు ఎవ‌రూ న‌ష్ట‌పోలేదు. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే కోటీశ్వ‌రులైపోయారు. ట‌మాటా ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. ఆ పంట వేసిన రైతులు భారీగా లాభాలు గ‌డించారు. అలా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ట‌మాటాలు అమ్మి ధ‌నికులైన రైతుల జాబితాలో మ‌న మెద‌క్ జిల్లాకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి చేరాడు. అంతేకాదు.. రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే టయోటా ఫార్చున‌ర్ కారు కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించాడు ఈ యువ రైతు.

మెద‌క్ జిల్లా కౌడిప‌ల్లి మండ‌లం మ‌హ‌మ్మ‌ద్‌న‌గ‌ర్ గ్రామానికి చెందిన రైతు బాన్సువాడ మ‌హిపాల్ రెడ్డి ట‌మాటాలు అమ్మి రూ. 3 కోట్ల‌కు పైగా సంపాదించాడు. త‌న‌కు ఆదాయం భారీగా రావ‌డంతో.. రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే ట‌యోటా ఫార్చున‌ర్ కారు కొన్నాడు. ఈ కారు తాళం చెవిని న‌ర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మ‌ద‌న్ రెడ్డి మ‌హిపాల్ రెడ్డికి శ‌నివారం అంద‌జేశారు.

37 ఏండ్ల వ‌య‌సున్న మ‌హిపాల్ రెడ్డికి 40 ఎక‌రాల వ్య‌వ‌సాయ పొలం ఉంది. దాంట్లో వివిధ ర‌కాల కూర‌గాయ‌లు పండిస్తున్నాడు. ఒక 8 ఎక‌రాల్లో కేవ‌లం ట‌మాటా మాత్ర‌మే సాగు చేశాడు. ఎండ‌కాలంలో టమాటా పంట వేసిన‌ప్ప‌టికీ.. షెడ్ నెట్స్ ఉప‌యోగించి, కంటికి రెప్ప‌లా ట‌మాటా పంట‌ను కాపాడాడు. ఆ ట‌మాటా పంట‌నే మ‌హిపాల్ రెడ్డికి కాసుల వ‌ర్షం కురిపించింది. తాను పండించిన ట‌మాటాను అమ్మి నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కోటీశ్వ‌రుడైపోయాడు. రూ. 3 కోట్లు సంపాదించాడు మ‌హిపాల్ రెడ్డి.

ప‌టాన్‌చెరు, షాపూర్, బోయిన్‌ప‌ల్లి మార్కెట్ల‌కు ట‌మాటాను త‌ర‌లించి, విక్ర‌యించిన‌ట్లు మ‌హిపాల్ రెడ్డి చెప్పుకొచ్చాడు. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి కూర‌గాయ‌లు పండిస్తున్నాన‌ని కానీ, ఈ లాభం ఎప్పుడూ రాలేద‌న్నాడు. ఒక నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కోటి రూపాయాలు సంపాదించ‌డం ఆనందంగా ఉండ‌ట‌మే కాదు.. ఆశ్చ‌ర్యంగా కూడా ఉంద‌న్నాడు.

ఈ సీజ‌న్‌లో మొత్తం 7 వేల బాక్సుల ట‌మాటాను విక్ర‌యించిన‌ట్లు తెలిపాడు. ఒక్కో బాక్సును రూ. 2,600కు విక్ర‌యించిన‌ట్లు పేర్కొన్నాడు. ఈ యువ రైతు ప‌దో త‌ర‌గతి ఫెయిల్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయంపై దృష్టి సారించి, త‌న భార్య స‌హ‌కారంతో కూర‌గాయ‌ల సాగు ప్రారంభించాడు. మొత్తంగా 20 ఏండ్ల త‌ర్వాత మ‌హిపాల్ రెడ్డి పంట పండింది. మ‌హిపాల్ భార్య బాన్సువాడ దివ్య మ‌హ‌మ్మ‌ద్ న‌గ‌ర్ స‌ర్పంచ్‌గా కొన‌సాగుతున్నారు.