Medak | కేసుల సంఖ్య పెరగడం న్యాయవ్యవస్థకు మంచిదికాదు: ఉజ్జల్ భుయాన్
Medak కోర్టుల పై ప్రజలకు నమ్మకం పెరిగేలా ఉండాలి బార్ - బెంచ్ న్యాయ వ్యవస్థకు రెండు చక్రాల్లాంటివి పెండిగ్ కేసుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విధాత,మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కేసుల సంఖ్య పెరగడం న్యాయ వ్యవస్థకు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టుల పై ప్రజలకు నమ్మకం పెరగాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టుకు […]
Medak
- కోర్టుల పై ప్రజలకు నమ్మకం పెరిగేలా ఉండాలి
- బార్ – బెంచ్ న్యాయ వ్యవస్థకు రెండు చక్రాల్లాంటివి
- పెండిగ్ కేసుల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలి
- హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
విధాత,మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కేసుల సంఖ్య పెరగడం న్యాయ వ్యవస్థకు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టుల పై ప్రజలకు నమ్మకం పెరగాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందన్న భావన ప్రజల్లో కలగాలన్నారు.

రూ 5 కోట్ల తో మెదక్ కోర్టుపై నిర్మించనున్న మూడో అంతస్తు భవన నిర్మాణానికి సంబంధించి శనివారం నాడు హైకోర్టు న్యాయమూర్తులు ఏ.సంతోష్ రెడ్డి,నవీన్ రావు, జిల్లా జడ్జి లక్ష్మి శారద, కలెక్టర్, రాజర్షి షా,ఎస్పీ రోహిణి ప్రియదర్శిని లతో కలసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెదక్ లో మూడో అంతస్తు నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. మౌళిక వసతులు సక్రమంగా ఉన్నప్పుడే కోర్టుల నిర్వహణ సజావుగా సాగుతుందన్నారు. న్యాయవాదులు, జడ్జీలు ఒక కుటుంబం లాంటిదని, అందరి సహకారంతోనే న్యాయవ్యవస్థ ముందుకు సాగుతుందన్నారు.

మౌళిక వసతులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని కోర్టులలో కావలసిన అవసరాలను తీర్చుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే మెదక్ లో జిల్లా కోర్టు భవనం విస్తరణకు అనుమతులిచ్చామన్నారు. న్యాయ వ్యవస్థకు బార్ అసోసియేషన్, బెంచ్ రెండు చక్రాల్లాంటివని అభివర్ణించారు. రెండు చక్రాలు బాగుంటేనే న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. కేసుల పరిష్కారం విషయంలో న్యాయవాదులు చొరవ తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో 25 నుంచి 30 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పెండింగ్ కేసులు ఎన్నో ఉన్నాయన్నారు. ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్ లో ఉండటం ఎవరికీ మంచిది కాదన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే.. కేసుల సత్వర పరిష్కారం అందరి ధ్యేయం కావాలన్నారు. ఎంతో నమ్మకంతో కోర్టులకు వచ్చే కక్షిదారులకు త్వరితగతిన పరిష్కరం చూపినప్పుడే మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.
సిబ్బంది కొరత కారణంగా కొన్ని కేసుల పరిష్కారం నెమ్మదిగా సాగుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో కేసుల తత్సారం వల్ల ప్రజల్లో అసహహం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తిస్తే న్యాయవ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తులు ఏ. సంతోష్ రెడ్డి, నవీన్ రావు, తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్. ప్రసాద్, సీ.ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి లక్ష్మీశారద, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమాసింగ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, పిపి లు ఫజల్ అహ్మద్, శ్రీనివాసరావు,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జెన్నారెడ్డి, సీనియర్ న్యాయవాదులు, ప్రతాప్ రెడ్డి, పోచయ్య, రాజిరెడ్డి, చంద్రా రెడ్డి, జనార్దన్ రెడ్డి, మాయ వెంకటేశం, సుభాష్ గౌడ్, రవీందర్, శోబాన్ గౌడ్, లక్ష్మణ్ కుమార్, మెదక్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram