Medak | పొంగి పొర్లుతున్న పోచారం ప్రాజెక్టు… నిడుకుండలా సింగూరు ప్రాజెక్టు..

Medak పరవళ్ళు తొక్కుతున్న మంజీర ఉదృతంగా ప్రవహిస్తున్న రాజిపేట వాగు దూప్ సింగ్ తండాకు రాకపోకలు బంద్.. విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: భారీ వర్షాలకు మెదక్, నిజామాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. పోచారం అభయారణ్యం ప్రాంతం కావడంతో పర్యాటకులతో సందడి నెలకొనుంది. మెదక్ మండలం రాజిపెట్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బూరుగుపల్లి గ్రామపంచయతీ పరిధిలో ఉన్న దూప్సింగ్ తండాకు రాకపోకలు […]

Medak | పొంగి పొర్లుతున్న పోచారం ప్రాజెక్టు… నిడుకుండలా సింగూరు ప్రాజెక్టు..

Medak

  • పరవళ్ళు తొక్కుతున్న మంజీర
  • ఉదృతంగా ప్రవహిస్తున్న రాజిపేట వాగు దూప్ సింగ్ తండాకు రాకపోకలు బంద్..

విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: భారీ వర్షాలకు మెదక్, నిజామాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. పోచారం అభయారణ్యం ప్రాంతం కావడంతో పర్యాటకులతో సందడి నెలకొనుంది.

మెదక్ మండలం రాజిపెట్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బూరుగుపల్లి గ్రామపంచయతీ పరిధిలో ఉన్న దూప్సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్వయంగా డిఎస్పీ సైదులుతో కలిసి సందర్శించారు.

సింగూరుకు జలకళ‌

భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నీరు చేరి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో నీటి పారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. దీంతో మంజీర నది ఉదృతంగా ప్రవహిస్తుంది. వన దుర్గా ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగి దుర్గామాత పాదాలను తాకూతు ప్రవహిస్తుంది.