Medak | రాజీవ్ గాంధీ ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: వెంకట్
Medak రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది బీఆర్ఎస్ నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి విద్యార్థులు కలిసి కట్టుగా పనిచేయాలి NSUI రాష్ట్ర అధ్యక్షుడు బాల్మురి వెంకట్ విధాత, మెదక్ బ్యూరో: రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రాష్ట్రంలో, దేశంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని NSUI రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో NSUI జిల్లా ముఖ్య […]

Medak
- రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది
- బీఆర్ఎస్ నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి విద్యార్థులు కలిసి కట్టుగా పనిచేయాలి
- NSUI రాష్ట్ర అధ్యక్షుడు బాల్మురి వెంకట్
విధాత, మెదక్ బ్యూరో: రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రాష్ట్రంలో, దేశంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని NSUI రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో NSUI జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి విద్యార్థులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోయే రాజీవ్ గాంధీ ఆన్‌లైన్ కాంపిటీషన్ పోటీలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో NSUI జాతీయ కోఆర్డినేటర్ ఫరాజ్,అఖిలేష్,పిసిసి మెంబర్ మమిల్ల ఆంజనేయులు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,అసెంబ్లీ అధ్యక్షులు రమేష్,భారత్ గౌడ్, శంసుందర్, ఇస్మాయిల్, NSUI జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షులు హరీష్ వర్ధన్,మహేష్ రెడ్డి, మనిదీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, అదిల్, సచిన్, అభిలాష్ సల్మాన్, శాంతికుమార్, NSUI మెదక్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.