Congress | ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
Congress | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ఆహ్వానం బడ్జెట్ చూసి హామీలివ్వండంటూ హితవు విధాత : తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలపై చర్చించారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, సీతక్క ప్రభృతులు ఖర్గేతో భేటీలో పాల్గొన్నారు. ఈనెల 26న చేవెళ్ల కాంగ్రెస్ బహిరంగ సభకు ఖర్గేను ఆహ్వానించారు. చేవేళ్ల సభలో పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ […]

Congress |
- ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ఆహ్వానం
- బడ్జెట్ చూసి హామీలివ్వండంటూ హితవు
విధాత : తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలపై చర్చించారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, సీతక్క ప్రభృతులు ఖర్గేతో భేటీలో పాల్గొన్నారు.
ఈనెల 26న చేవెళ్ల కాంగ్రెస్ బహిరంగ సభకు ఖర్గేను ఆహ్వానించారు. చేవేళ్ల సభలో పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ఖర్గే చేతుల మీదుగా విడుదల చేయాల్సిందిగా ఆయనను కోరారు. అలాగే ఈనెల 29న వరంగల్‌లో మైనార్టీ డిక్లరేషన్, ఆ తర్వాతా మహిళా, ఓబీసీ డిక్లరేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నామని, మహిళా డిక్లరేషన్‌కు ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా వివరించారు.
ఇప్పటికే యూత్, రైతు డిక్లరేషన్ విడుదల చేశామని, సోనియాగాంధీతో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ఖర్గేకు వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ఎన్నికల హామీలను రాష్ట్ర బడ్జెట్ చూసుకుని ఎన్నికల హామీలివ్వాలని సూచించారు. ఇబ్బడి ముబ్బడి హామీలు ఇవ్వకపోతే మేలంటూ హితవు పలికారు.
భేటి అనంతరం భట్టి విక్రమార్క విలేఖరులతో మాట్లాడుతు ఖర్గేతో భేటిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇవ్వనున్న ఎన్నికల హామీలపై చర్చించామని, ఈ నెల 26న జరిగే చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ సభకు ఆయనను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీలు, వ్యూహాలపై ఖర్గే పలు సూచనలు చేశారన్నారు.