బ్రహ్మీ మొహం చూస్తేనే పొట్ట చెక్కలవుతుంది.. చిరు ట్వీట్
Brahmanandam | తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం పేరు వినగానే కామెడీ గుర్తుకు వస్తుంది. ఆయన నటించిన సినిమాలను చూస్తే కడుపుబ్బా నవ్వుతాం. అలా బ్రహ్మీ కామెడీలో పంచింగ్, టైమింగ్ ఉంటుంది. అట్లాంటి బ్రహ్మీకి ప్రేక్షకులే కాదు.. పెద్ద పెద్ద నటులు కూడా అభిమానులుగా ఉన్నారు. ఆ అభిమానులు, అత్యంత ఆప్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇక బ్రహ్మానందానికి బర్త్ డే విషెస్ తెలిపేందుకు చిరంజీవి నేరుగా బ్రహ్మీ ఇంటికే వెళ్లారు. బ్రహ్మీకి ఎంతో […]

Brahmanandam | తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం పేరు వినగానే కామెడీ గుర్తుకు వస్తుంది. ఆయన నటించిన సినిమాలను చూస్తే కడుపుబ్బా నవ్వుతాం. అలా బ్రహ్మీ కామెడీలో పంచింగ్, టైమింగ్ ఉంటుంది. అట్లాంటి బ్రహ్మీకి ప్రేక్షకులే కాదు.. పెద్ద పెద్ద నటులు కూడా అభిమానులుగా ఉన్నారు. ఆ అభిమానులు, అత్యంత ఆప్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇక బ్రహ్మానందానికి బర్త్ డే విషెస్ తెలిపేందుకు చిరంజీవి నేరుగా బ్రహ్మీ ఇంటికే వెళ్లారు. బ్రహ్మీకి ఎంతో ఇష్టమైన వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలను చిరు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంటూ ఓ చిరు సందేశాన్ని పంచుకున్నారు.
‘నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పది మందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందంకు మరింత బ్రహ్మాండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Happy Birthday
Dear Brahmanandam