Singapore | కాలికి దెబ్బ త‌గిలింద‌ని.. సింగ‌పూర్ కంపెనీపై రూ.6 కోట్ల దావా! కేసు నెగ్గిన భార‌తీయ కార్మికుడు

Singapore | సింగ‌పూర్‌లో ప‌నిచేసే భార‌తీయ కార్మికుడు త‌న సంస్థ‌పై కోర్టు కెక్కి భారీ మొత్తంలో న‌ష్ట‌ప‌రిహారం పొందాడు. ప‌ని చేసే స‌మ‌యంలో సంస్థ స‌రైన నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌న కాలికి గాయ‌మైంద‌ని కోర్టును ఆశ్ర‌యించ‌గా.. కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. త‌మిళ‌నాడుకు చెందిన 37 ఏళ్ల రామ‌లింగం అనే వ్య‌క్తి సింగ‌పూర్‌లో వ‌ల‌స కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. 2021లో కిక్కిరిసిన లారీలో తోటి కార్మికుల‌తో క‌లిసి వారు ఉండే ప్రాంతం నుంచి తాము ప‌నిచేసే […]

  • By: krs    latest    Aug 27, 2023 6:29 AM IST
Singapore | కాలికి దెబ్బ త‌గిలింద‌ని.. సింగ‌పూర్ కంపెనీపై రూ.6 కోట్ల దావా! కేసు నెగ్గిన భార‌తీయ కార్మికుడు

Singapore |

సింగ‌పూర్‌లో ప‌నిచేసే భార‌తీయ కార్మికుడు త‌న సంస్థ‌పై కోర్టు కెక్కి భారీ మొత్తంలో న‌ష్ట‌ప‌రిహారం పొందాడు. ప‌ని చేసే స‌మ‌యంలో సంస్థ స‌రైన నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌న కాలికి గాయ‌మైంద‌ని కోర్టును ఆశ్ర‌యించ‌గా.. కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

త‌మిళ‌నాడుకు చెందిన 37 ఏళ్ల రామ‌లింగం అనే వ్య‌క్తి సింగ‌పూర్‌లో వ‌ల‌స కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. 2021లో కిక్కిరిసిన లారీలో తోటి కార్మికుల‌తో క‌లిసి వారు ఉండే ప్రాంతం నుంచి తాము ప‌నిచేసే నిర్మాణ సంస్థ‌కు వ‌స్తున్నారు. ఈ క్రమంలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో.. తోటి కార్మికుడు త‌డ‌వ‌కుండా ఉండేందుకు రామ‌లింగాన్ని గ‌ట్టిగా నెట్టాడు.

ఈ క్ర‌మంలో బాధితుడు కింద‌ ప‌డిపోవ‌డంతో అత‌డి కాలుకి తీవ్ర‌గాయ‌మై ఆసుప‌త్రి పాల‌య్యాడు. ఈ మొత్తం ఘ‌ట‌న‌లో తాను బాధ‌ ప‌డ‌టానికి త‌మ యాజ‌మాన్య సంస్థ రైగ‌ల్ మెరైన్ స‌ర్వీసెస్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని కోర్టును ఆశ్ర‌యించాడు. 22 మంది ప్ర‌యాణించాల్సిన ట్ర‌క్కులో 25 మందిని కుక్కేసి పంపించార‌ని.. కార్మికుల‌కు అనువైన ప‌ని వాతావ‌ర‌ణం క‌ల్పించ‌లేద‌ని క‌నిపిస్తోంది కాబ‌ట్టి త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల‌ని అభ్య‌ర్థించాడు.

ఈ స‌ర్దుబాటు ఆ ఒక్క‌రోజు జ‌రిగిందే కాద‌ని… ఇక్క‌డ ప‌నివారిని ఇలా కిక్కిరిసేలా వాహనాల్లో కుక్కేసి త‌ర‌లించ‌డం సంస్థ‌లు త‌ర‌చూ చేసేద‌న‌ని కోర్టుకు నివేదించాడు. మొత్తం తాను కోల్పోయిన జీతానికి, స‌ర్జరీ ఖ‌ర్చుల‌కు, తాను బాధ‌ ప‌డిన దానికి ప్ర‌తిఫ‌లంగా సుమారు రూ.6 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని దావాలో పేర్కొన్నాడు.

అయితే ఈ ఆరోప‌ణ‌లను రైగ‌ల్ మెరైన్ స‌ర్వీసెస్ ఖండించింది. బాధితుడు వైద్య చికిత్స‌ల‌కు అయిన ఖ‌ర్చును తామే భ‌రించామ‌ని.. ఆ ప్ర‌మాదం కూడా అతడి నిర్ల‌క్ష్యం వ‌ల్లే జ‌రిగింద‌ని కోర్టుకు తెలిపింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న జిల్లా జ‌డ్జి టాన్ మే టీ.. బాధితునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

కార్మికుల‌కు స‌రైన వ‌స‌తి, సౌకర్యాలు క‌ల్పించ‌డంలో రైగ‌ల్ మెరైన్ తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు త‌న‌కు క‌న‌ప‌డుతోంద‌ని జడ్జ్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఇందులో కార్మికుడి ఏమ‌రుపాటు ఉన్న‌ట్లు త‌న‌కు అనిపించ‌డం లేద‌ని ప‌రిమితికి మించి కార్మికుల‌ను ఎక్కిస్తే వారిది త‌ప్పెలా అవుతుంద‌ని సంస్థ న్యాయ‌వాదిని ప్రశ్నించారు.

ఈ తీర్పుపై మురుగున్ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో ముగిసిపోవాల‌ని ఆకాంక్షించాడు. అయితే మురుగన్‌కు ఎంత న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌నే దానిపై త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు ఇస్తామ‌ని జ‌డ్జ్ త‌న తుది ఉత్త‌ర్వుల్లో స్పష్టం చేశారు.