పెండింగ్ వేతనాల కోసం బాయిలర్ ఎక్కిన కార్మికుడు
పెండింగ్ వేతనాలు చెల్లించి పరిశ్రమను నడిపించాలని కోరుతూ ఓ కార్మికుడు పరిశ్రమ బాయిలర్ పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు
విధాత: పెండింగ్ వేతనాలు చెల్లించి పరిశ్రమను నడిపించాలని కోరుతూ ఓ కార్మికుడు పరిశ్రమ బాయిలర్ పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామంలోని షుగర్ పరిశ్రమల కార్మికులకు సంవత్సరం నుండి జీతాలు చెల్లించకపోగా, పరిశ్రమ నిర్వాహణ నిలిపివేశారు.
దీంతో రమేశ్ బాబు అనే కార్మికుడు తమకు వెంటనే జీతాలు చెలించాలని, పరిశ్రమను నడిపించాలని డిమాండ్ చేస్తూ కంపనీ బాయిలర్ చిమ్నీపైకి ఎక్కి దూకుతానంటూ హల్‌చల్ చేశాడు. పోలీసులు, కంపనీ ప్రతినిధులు నచ్చచెప్పిన మీదట అతను శాంతించి కిందకు దిగాడు. ఈ సమస్యపై కార్మికులతో చర్చలు కొనసాగిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram